తిరుమల శ్రీవారి సన్నిధిలో సూపర్​స్టార్​ రజనీకాంత్.. కుమార్తె ఐశ్వర్యతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు

Superstar Rajinikanth Visits Tirumala Srivari Temple and Offers Special Pujas Along with Daughter Aishwarya,Superstar Rajinikanth Visits Tirumala,Special Pujas At Tirumala Srivari Temple,Superstar Daughter Aishwarya,Mango News,Mango News Telugu,Tirumala Venkateswara Temple,Tirumala Darshan,Tirupati Darshan,Ttd Online Booking,Ttd Darshan,Ttd News,Ttd Seva,Tirumala Venkateswara Temple,Superstar Rajinikanth Ttd Darshan,Rajinikanth Ttd Darshan,Superstar Rajinikanth Visits Tirumala Temple,Rajinikanth Visit Thirupati,Actor Rajinikanth Offers Prayers,

ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన టీఎస్‌ఆర్‌ అతిథి గృహంలో బస చేశారు. అక్కడ వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ తదితరులు ఆహ్వానం పలికారు. ఇక ఈరోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న రజనీకాంత్, ఐశ్వర్యలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు స్వామివారికి కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాగా రజనీకాంత్ ఇటీవలే డిసెంబర్ 12వ తేదీన తన 72వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అలాగే ఈరోజు రజనీకాంత్ కడప జిల్లాలోని ప్రసిద్ధ ‘అమీన్‌ పీర్‌’ దర్గాను కూడా దర్శించుకోనున్నారు. ఆయనతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కూడా దర్గాను సందర్శించుకోనున్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన కొత్త చిత్రం ‘జైలర్’ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. దీనికి ‘బీస్ట్’ సినిమా ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ధనుర్మాసం కారణంగా ఈ నెల 17 నుంచి స్వామి వారికి నిర్వహించే సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =