వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పుస్తకం

Ap Political Live Updates, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, TDP To Release A Book On YCP Government, TDP To Release A Book On YCP Govt, TDP To Release A Book On YCP Govt 100 Days Governance, TDP To Release A Book On YCP Govt’s 100 Days Governance, TDP To Release A Book On YCP100 Days Governance

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఒక్కో అంశాన్ని ప్రజలకు అందించేలా ప్రయత్నాలు మొదలుపెట్టి ముందుకు సాగుతున్నారని రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు కొనియాడుతున్నారు. లక్షల్లో ఉద్యోగ నియామకాలు, పలు డిపార్టుమెంట్ ఉద్యోగుల జీతాల పెంపు, పింఛన్ పెంపు వంటి ఇతర అనేక జనమోద నిర్ణయాలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పాలన కొనసాగుతుందని వైసీపీ నాయకులు వివరిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలనలో వైఫల్యాలు జరిగాయంటూ చార్జిషీట్ పేరుతో పుస్తకం లేదా కొన్ని పేజీల బ్రోచర్ సిద్ధం చేసింది. దీనిని విడుదల చేసేందుకు టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

గత 100 రోజుల పాలనలో ప్రజావేదిక కూల్చివేత, రాజధాని పనుల నిలిపివేత, పోలవరం రివర్స్ టెండరింగ్ ఆదేశాలు, టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వివిధ అభివృద్ధి పథకాల నిలుపుదలపై ఈ బ్రోచర్ లో వివరంగా పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతర నాయకులు ఈ బ్రోచర్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని అమరావతిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here