రాష్ట్రాలలో లాక్‌డౌన్ విధింపుపై కేంద్రం కీలక ఆదేశాలు

Coronavirus Lockdown, India Unlock 4, india unlock 4 india, India Unlock 4.0, India Unlock 4.0 News, India’s Unlock 4.0 Amid COVID 19, Indian Government, unlock 4, unlock 4 guidelines, unlock 4 guidelines india, unlock 4 india, Unlock 4.0 guidelines, Whats Allowed and Whats Not In unlock 4

కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాలలో స్థానికంగా లాక్‌డౌన్ విధించడంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతో ముందస్తు సంప్రదింపులు లేకుండా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ల వెలుపల స్థానిక లాక్‌డౌన్ (రాష్ట్రము/జిల్లా/నగరాలు/పట్టణాలు/గ్రామ స్థాయి) విధించకూడదని పేర్కొన్నారు. అలాగే అంతరాష్ట్ర ప్రయాణాలు, వస్తు రవాణాపై ఎలాంటి నిబంధనలను ఉండవని తెలిపారు. రాష్ట్రాల మధ్యలో ప్రయాణం లేదా రవాణాకు ప్రత్యేక అనుమతి, ఆమోదం లేదా ఇ-పర్మిట్ అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం ఆదేశాలు దేశవ్యాప్తంగా అనుసరించాలని అన్నారు. దుకాణాల వద్ద కూడా కస్టమర్లు తగినంత భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఈ ఆదేశాలు అమలవుతున్న తీరును కేంద్ర హోమ్ శాఖ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =