వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలి : పవన్ కళ్యాణ్

2021 Ganesh Chaturthi Celebrations, AP Ganesh Chaturthi Celebrations, Ganesh Chaturthi Celebrations, Ganesh Chaturthi Celebrations 2021, Ganesh Chaturthi Celebrations In AP, Mango News, No public celebrations on Ganesh Puja, pawan kalyan, Pawan Kalyan Demands AP Govt, Pawan Kalyan Demands AP Govt to Give Permission for Vinayaka Chavithi Celebrations, Vinayaka Chavithi, Vinayaka Chavithi Celebrations

ఏపీ ప్రభుత్వం వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకుని, ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నాకు నిజంగా అర్ధం కాలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిసంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది మన రాష్ట్రంలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం, గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలి. మన భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికే. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే ఏ పనైనా మొదలుపెడతాం. అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఈ రోజు వరకు దోషులను పట్టుకోలేదు. వారిని పట్టుకోకపోగా, ఈ రోజు కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు? దేనిమీద దాడి చేస్తున్నాయో అర్ధమవుతుందా? ఒక్కసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం. మీరు వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో మీరు కూడా అదే పరిమితులతో ఇక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వాలి. ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిది. జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా పర్మిషన్లు ఇవ్వాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =