మేలుకో తెలుగోడా..బస్సు యాత్ర

Nara bhubaneswari bus trip route map ready,Nara bhubaneswari bus trip,Bus trip route map ready,Route map ready,Mango News,Mango News Telugu,Nara Bhuvaneshwari Bus Yatra,Nara Bhubaneswari, Bus Trip, Route Map Ready,Nara bhubaneswari Latest News,Nara bhubaneswari Latest Updates,Nara City Main Bus Route Map News Today,Nara City Main Bus Route Map Latest News,Nara City Main Bus Route Map Latest Updates

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల రాజమండ్రిలోనే భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇకపై నిరాహార దీక్షలు వంటివి కాకుండా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవడానికి భువనేశ్వరి రెడీ అవుతున్నారు. అది కూడా తన తొలి అడుగును కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.

మేలుకో తెలుగోడా పేరుతో బస్సు యాత్రను కుప్పం నుంచి ప్రారంభించే ఆలోచనలో నారా భువనేశ్వరి ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఆధ్వర్యంలో భువనేశ్వరి బస్ యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. దీని కోసం కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ నేతలు.. ఆ వివరాలను కూడా టీడీపీ అధిష్ఠానానికి పంపించారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు..కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద.. ఒక పెద్ద బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.కానీ భువనేశ్వరి బస్సుయాత్ర తేదీ మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, ఢిల్లీలోనూ దీక్షలు చేపట్టారు టీడీపీ వర్గాలు. అలాగే రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి చేసిన ఒక్కరోజు నిరాహర దీక్షకు కూడా.. పార్టీ క్యాడర్ భారీ ఎత్తున మద్దతు పలికింది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల వినూత్న రీతిలో పార్టీ శ్రేణులు దీక్షలు చేశారు. కానీ ఆ తర్వాత పరిణామాలతో కొద్ది రోజుల నుంచీ ఢిల్లీలో ఉంటూ వస్తున్న నారా లోకేష్ రెండు రోజులుగా ఏపీలో ఉంటున్నారు . నారా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు.

నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ శ్రేణులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలపడంతో పాటు.. అక్కడే ఉంటూ పార్టీ కేడర్‌కు మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే వీటన్నిటి కంటే బస్సు యాత్ర చేపట్టి జనాల్లోకి వెళితే సింపతీ పెరగడంతో పాటు..ప్రజల్లో మమేకం అవడానికి ఇదే కరెక్ట్ టైమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోనే ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బస్సు యాత్రను ప్రారంభించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. దీనికోసం పార్టీలో చర్చించి.. దీనికి తగినట్లు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కేసులో వెలువడే తీర్పుకు అనుగుణంగా.. భువనేశ్వరి బస్సు యాత్రపై ఫైనల్ నిర్ణయం ఉండే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగించాలని సీఐడీ తాజాగా మెమో దాఖలు చేసింది. సీఐడీ తరఫున తన వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరగాలని అందుకే చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్‌ మొత్తానికి సూత్రధారి చంద్రబాబేనని.. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకుండా కస్టడీకిఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =