శక్తివంతమైన సైన్యం కలిగి ఉన్న టాప్ టెన్ దేశాలు ఏవో తెలుసా?

Global Fire Power Survey,Global Firepower Report 2023, Less military, For the defense sector, Modern fighter jets, Explosives,Top 10 Countries Which Have Strongest Military Forces in The World,United States Military,Russia Military,China Military,Mango News, Mango News Telugu,India Military,United Kingdom Military,South Korea Military,Pakistan Military,Japan Military,France Military,Italy Military,

ఒక దేశానికి సైన్యం అనేది తప్పని సరిగా ఉంటుంది..ఉండాలి కూడా. దీనికి తోడు ఎప్పటికప్పుడు శత్రు దేశాల నుంచి ముప్పును తొలగించుకునేందుకు ఆ సైన్యాన్ని మరింత పెంచుతూ ఉండాలి. సైన్యం అంటే మనుషులను నియమించడంతోనే సరిపోదు. దానికి తగ్గట్టుగానే ఆయుధాలు, మందు గుండు సామగ్రి, యుద్ధ విమానాలు వంటివి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కేవలం రక్షణ రంగం కోసమే ఎక్కువ భాగం బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే..ఈ బడ్జెట్‌తో ఆఫ్రికా వంటి దేశాలను.. దారిద్రరేఖ దిగువ నుంచి ఎగువకు మార్చేయొచ్చు.

నిజానికి ప్రపంచంలో రక్షణ రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని.. గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ ఎప్పటికప్పుడు తెలియ జేస్తుంది. ప్రతి ఏడాది గ్లోబల్ ఫైర్ పవర్ సర్వే నిర్వహించినట్లే.. ఈ ఏడాది కూడా అది సర్వే నిర్వహించింది. ఈ సర్వే వెల్లడించిన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక సైనిక శక్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిలిచాయి. దీని తర్వాత స్థానాల్లో చైనా, రష్యా, ఇండియా నిలిచాయి. గ్లోబల్ ఫైర్ పవర్ 145 దేశాలను లెక్కలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఏ దేశం రక్షణ రంగానికి ఎంత కేటాయిస్తుంది? ఎంతమంది సైనికులను నియమించుకుంటుంది? యుద్ధ విమానాల కోసం ఎంత ఖర్చు చేస్తోంది? అనే విషయాలపై సమగ్ర వివరాలను సేకరించింది. సైనిక దళాలతో పాటు అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలు, పేలుడు సామాగ్రి అమెరికా సంయుక్త రాష్ట్రాల వద్ద చాలానే ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది. ఇక తర్వాత సెకండ్ ప్లేసులో ఉన్న రష్యా వద్ద.. సైనిక దళాలు, రక్షణ రంగానికి సంబంధించిన పేలుడు సామాగ్రి పుష్కలంగా ఉన్నాయి.

ఒకవిధంగా చెప్పాలంటే.. రష్యా ఉక్రెయిన్‌తో వార్ మొదలు పెట్టక ముందు అమెరికాతో ఈక్వెల్‌గానే ఉండేది. కానీ యుద్ధం వల్ల రష్యా భారీగా సైనికులను కోల్పోయింది. పేలుడు సామగ్రిని కూడా వినియోగించింది. ఫలితంగా అది రెండవ స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే సెకండ్ ప్లేస్ కంటే తక్కువే ఉన్నట్లు సర్వే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక వీటి తర్వాత చైనా మూడవ స్థానంలో కొనసాగుతోంది. భారత్ నాలుగవ స్థానంలో నిలుస్తూ.. ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే గట్టిగా సమాధానం చెప్పడానికి రెడీగానే ఉంది. అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఐదవ స్థానంలో, దక్షిణ కొరియా ఆరవ స్థానంలో, పాకిస్తాన్ ఏడవ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, ఫ్రాన్స్ తొమ్మిదవ స్థానంలో, ఇటలీ పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.

గ్లోబల్ ఫైర్ పవర్ అంతకుముందు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. లాస్ట్ ఇయర్ ఎనిమిదవ స్థానంలో ఉన్న యూకే ఈ సంవత్సరం ఐదవ స్థానానికి ఎగబాకింది. గత ఏడాది మాదిరిగానే దక్షిణ కొరియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ కూడా ఏడో స్థానంలోకి కొనసాగుతోంది. జపాన్, ఫ్రాన్స్ గతేడాది 5, 7 స్థానాల్లో ఉండగా.. ఈ ఏడాది మాత్రం 8, 9 స్థానాలకు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా.. రెండో స్థానంలో ఉండటంపై గ్లోబల్ ఫైర్ పవర్ అనుమానం వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో మందు గుండు సామాగ్రి, సైనికులను కోల్పోయినా కూడా.. ఇంకా ఆ దేశం రెండో స్థానంలో కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఇక గ్లోబల్ ఫైర్ పవర్ అత్యంత తక్కువ మిలటరీ ఉన్న దేశాల వివరాలను కూడా ప్రకటించింది. ఈ జాబితాలో భూటాన్ మొదటి స్థానంలో ఉండగా.. బెనిన్ రెండో స్థానం, మోల్డోవా 3 వ స్థానం, సోమాలియా నాలుగో స్థానం, లైబీరియా ఐదో ప్లేసు, సూరి నామ్ ఆరవ స్థానం, బెలిజ్ఏడవ స్థానం, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఎనిమిదవ స్థానం, ఐస్ లాండ్ తొమ్మిదవ స్థానం, సియర్రా లియోన్ పదో ప్లేసులో కొనసాగుతున్నాయి. ఈ దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతోనే.. అవి సైన్యం కోసం తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని గ్లోబల్ ఫైర్ పవర్ అభిప్రాయ పడింది. వరుస కరువు కాటకాలు ఆ దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నా భిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =