సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబాకు మొక్కులు ఎలా తీర్చుకుంటారో తెలుసా?

Sagas Maharaj Ghadi Wale Baba, Pray to God with clocks,Light a cigarette and pray,Clock is God

ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారం, ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అందుకే ఒకరి నమ్మకాన్ని ఇంకొకరు గౌరవిస్తూ , వీలయితే వాళ్ల నమ్మకాలను కొనసాగిస్తూ ఉంటారు కనుకే భారతీయులది సర్వమత సమ్మేళన దేశంగా ఇతర దేశాలు గౌరవిస్తాయి. ఇండియాలో రాష్ట్రాలకు, జిల్లాలకు, చివరకు పల్లె పల్లెకు మధ్య ఎన్నో వింత ఆచారాలు, సంప్రదాయాలు కొలువై ఉంటాయి. కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే.. భక్తి పారవశ్యంతో మునిగితేలుతారు. మరి కొన్ని ఆచారాలు చూసి ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. చివరకు భగవంతుడిని కొలిచే విధానంలోనూ వింత ఆచారాలు, వినూత్న సంప్రదాయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా గురించి విన్నా.. అంతా అలాగే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా గుడిలకు వెళ్తే కొబ్బరికాయలు, అరటిపళ్లు, పసుపు,కుంకుమ, అగర్‌బత్తీలు, పువ్వులు తీసుకువెళ్లి.. కొన్ని పర్వదినాల్లో అక్కడ దీపాలు వెలిగించి హుండీలో డబ్బులు వేసి వస్తారు. లేదా కొంతమంది తాము మొక్కుకున్న మొక్కులు తీరితే.. వారి కోరికున్నట్లు డబ్బులో, బంగారమో, ఇతర వస్తువులో దేవుడికి సమర్సించి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొంతమంది ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి టెంకాయ కొట్టి భగవంతునికి మొక్కులు తీర్చుకుంటారు. ఇంకా కొన్ని ఆచారాలలో దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఆ భగవంతుడుని భావించి ముడుపులు కట్టి కోరికలు తీరాక మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొన్ని దేవాలయాలలో మాత్రం కోరికలు కోరుకునేటప్పుడు ఎక్కడా లేని కొన్ని వింత ఆచారాలను పాటిస్తారు.అంతేకాదు చివరకు కోరికలు తీరిన తరువాత కూడా అంతే వింతగా మొక్కులు తీర్చుకుంటారు

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో అన్హెల్ రోడ్డులో.. ఎన్నో ఏళ్లుగా సాగస్‌ మహారాజ్‌ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ బాబా అంటే స్థానికులకు బాగా నమ్మకం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు.. తమ కోరికలు నెరవేరాలని బాబా ముందు దీపమో, అగర్‌బత్తినో కాకుండా సిగరెట్ వెలిగించి మొక్కుకుంటారట. అప్పుడే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అలాగే వాళ్ల కోరికలు తీరిన తరువాత భక్తులు బాబాకు గడియారాన్ని సమర్పించి ..తమ మొక్కులు తీర్చుకుంటారట. కోరికలు తీరిన తరువాత భక్తులు సమర్పించే గడియారాలతో ఆ ఆలయంలో ఉండే మర్రిచెట్టు పూర్తిగా నిండిపోవడంతో.. ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దంతో మారు మోగిపోతుందట. అందుకే ఈ దేవుడిని ఇక్కడి వారు గడియారం దేవుడుగా పిలుస్తారు.

అంతే కాదు..అన్ని ఆలయాల్లో ఉంటున్నట్లుగా ఈ ఆలయంలో పూజారులు కూడా ఎవరూ ఉండరు.అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత పెద్దదే కానీ ఆలయం మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంటుందట. ఈ ఆలయానికి ఓ కథ కూడా ఉంది. ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద యక్షుడే దేవుడుగా కొలువై ఉన్నాడట. ఈ ఆలయం ఎప్పటి నుంచో ఉన్నా.. 10 ఏళ్ల క్రితమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరడంతో..బాబాపై గురి పెరగడంతో ఒక్కసారిగా ఆ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడ భక్తులు మర్రిచెట్టుకు కట్టిన గడియారాలను ..ఇప్పటి వరకూ ఎవరూ కూడా దొంగిలించకపోవడం మరో విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + ten =