ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. నేడే తొలి దశ పోలింగ్‌

2022 UP assembly election, Assembly Elections Polling 2022 Updates Voting, Mango News, UP Assembly Elections, UP Assembly Elections Polling, UP Assembly Elections Polling 2022, UP Assembly Elections Polling 2022 Updates, UP Assembly Elections Polling 2022 Updates Voting, UP Assembly Elections Polling 2022 Updates Voting For First Phase, UP Assembly Elections Polling 2022 Updates Voting For First Phase Under Way in 58 Seats Today, Up Assembly Polls, UP Assembly Polls 2022, Yogi Adityanath UP Assembly Elections

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభం అయింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. కోవిడ్ నేపథ్యంలో.. ఎన్నికల అధికారులు నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, మాస్కులు, గ్లౌజులు ఉంచారు. క్యూ లైన్లలో రద్దీని నివారించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టోకెన్లను జారీ చేశారు. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు గాను 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ తొలిదశ పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని 9 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు పార్టీల మధ్య బహుముఖ పోరు నెలకొంది. బీజేపీ, ఎస్పీ- ఆర్‌ఎల్డీ, కాంగ్రెస్‌, ఎంఐఎం, ఆప్‌ పార్టీలు పోటీలో ఉన్నాయి. అసలైన పోరు బీజేపీఎస్పీ మధ్యే జరుగనుంది. తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయడానికి ఓటర్లు బారులు రీరారు. మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు తొలిదశ పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే, ఈసారి ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో రాజకీయ సమీకరణాల లెక్కలు మారుతున్నాయి. కాగా, కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని, ఈవీఎంల సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. యూపీలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =