త్వరలో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ.. పార్టీ పేరు అదే..

Thalapathy Vijay, Tamilnadu, Hero vijay, Vijay new party, Politics, Political Entry, popular Tamil actor, Tamil Nadu politics, Kollywood, Kollywood film industry, Vijay Makkal Iyakkam, Vijay Politics Entry, Actor Vijay entering politics, Vijay Thalapathi, Mango News Telugu, Mango News
Thalapathy Vijay, Tamilnadu, Hero vijay, Vijay new party

తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోబోతోందా..?.. లోక్ సభ ఎన్నికలకు ముందే పార్టీ ప్రకటన వెలువడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని మీడియా కోడైకూస్తోంది. రెండు, మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. అయితే పలు కారణాల వల్ల విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఆలస్యమయింది. కానీ  ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.

కొద్దిరోజులుగా విజయ్ తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ముఖ్యంగా ముందు నుంచి కూడా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పది, ఇంటర్‌లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నారు. అదే సమయంలో తన కోట్లాది మంది అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని విజయ్‌ను కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమయిందని తెలుస్తోంది.

త్వరలోనే తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారట. మొన్నటి వరకు కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయల్లోకి ఇంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆయన తాను రాజకీయాల్లోకి రాను అని ఇటీవలే స్పష్టం చేశారు. దీంతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని వేగవంతం చేశారట. ఇప్పటికే తన అభిమాన సంఘమయిన విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో పలుమార్లు విజయ్ సమావేశాలు నిర్వహించారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి వారితో చర్చలు జరిపారు.

ఈక్రమంలో మరోసారి విజయ్ తన అభిమాన సంఘ నిర్వాహకులతో సమావేశమయ్యారు. దాదాపు 150 మంది అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో స్థాపించబోయే పార్టీ పేరు, జెండా.. అలాగే తమ అజెండాల గురించి విజయ్ అభిమానులతో చర్చించారట. పార్టీ పేరు విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి ఓ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  తమిళగం, మున్నేట్రం, కళగం అనే మూడు పదాలు కలిసేలా తమిళగ మున్నేట్ర కళగం అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈనెలలోనే విజయ్ తన పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =