ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. సహజంగానే ప్రతి మనిషిలోనూ కొంత నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్పారు. అలాగే నాయకుడిగా ఎదగడాలంటే ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, వినడం, ప్రేరణ కల్పించడం వంటి ముఖ్యలక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. ఒక సంస్థ విజయవంతంగా ముందుకెళ్లాలంటే నాయకుడు భవిష్యత్ దర్శనం చేయగల్గడంతో పాటుగా, తన జట్టులోని ఇతర సభ్యులుకు అన్ని విషయాలు నేర్పించి కలిసికట్టుగా పనిచేసేలా మార్గదర్శకత్వం చేయగలగాలని చెప్పారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని, జీవితంలో కీలక స్థాయికి చేరుకోవడానికి పాటించాల్సిన సూత్రాలను ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి
[subscribe]