బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌, లేఖ విడుదల

Aler Ex-MLA Bikshamaiah Goud Resigns to BJP Released Resignation Letter with Reasons, Aler Ex-MLA Bikshamaiah Goud, Bikshamaiah Goud Resigns to BJP, Bikshamaiah Goud Resignation Letter, Bikshamaiah Goud Resigned To BJP, Mango News, Mango News Telugu, Telangana Alair ex-MLA Bikshamaiah Goud, Alair ex-MLA Bikshamaiah Goud, Ex-Telangana MLA B Bikshamaiah Goud, Bikshamaiah Goud Quits BJP, Telangana BJP, BJP Party Latest News And Updates, Telangana News And Live Updates

ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. 2018 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న భిక్షమయ్య గౌడ్‌ గత ఏప్రిల్ లోనే ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా భిక్షమయ్య గౌడ్‌ గురువారం ఓ లేఖను విడుదల చేశారు. బీజేపీలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని, అలాగే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు.

“భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటు భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేఖంగా ఆ పార్టీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధానమంత్రి నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయకపోవడం, ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమనట్లు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వారు, బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మాడల్ లోని డొల్లతనానికి అర్థం పడుతున్నది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అశించాను. కానీ ప్రతిసారి నిరాశను ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడంతోపాటు, దేశం చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఝప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి, జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధను కలిగిస్తున్నది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది” అని భిక్షమయ్య గౌడ్‌ పేర్కొన్నారు.

“తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హై కమాండ్ కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలనికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హై కమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పటిదాకా ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. నా సొంత పూర్వ నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకే తలమాణికంగా నిలిచేలా నిర్మాణం చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కనీసం గుర్తించలేని బీజేపీ వైఖరి, వారు చేప్పే మాటలకి వారి చేతలకు అర్థం లేదనే విషయం తేలిపోతుంది. దీంతోపాటు నా చిన్నతనం నుంచి చూస్తూ వచ్చిన దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అద్యక్షులు, అప్పటి కేంద్ర అరోగ్య మంత్రి జెపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లొరైడ్ భాదితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ అయన ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లొరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైస రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. నల్లగొండలో కొమటిరెడ్డి సోదరుల వలన వందల మంది గౌడ సోదరుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు. కోమటి రెడ్డి సొదరుల దుర్మార్గపు రాజకీయల నుంచి దూరంగా పోయేందుకే బీజేపీలో చేరాను. కానీ రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి బీజేపీలోకి వచ్చారు. అయన వేల కోట్ల ఆర్ధిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బీజేపీ పార్టీ బిసిల మనోభావాలకు విలువ లేకుండా చేసింది. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేఖంగా బీజేపీ పార్టికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇలా ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, దక్కాల్సినవి ఆపి పెడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో బీజేపీ చేస్తున్న అబద్ధపు డొల్ల ప్రచారానికి వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలకి వ్యతిరేకంగా, నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా మునుగొడుకి బీజేపీ ఇచ్చిన హమీలు నేరవేర్చనందుకు నిరసనగా పార్టీని వీడుతున్నాను. ఇప్పటికైనా ప్రజలను చీల్చుకుంటూ, శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మతచిచ్చు రగిలించవద్దని పార్టీని వీడుతున్న సందర్భంగా బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఈ ఉపఎన్నిక సందర్భంగా అయినా మునుగొడు నియోజక వర్గంలో బీజేపీ ఇచ్చిన హమీలు నేరవేర్చి తమ నిబద్దత నిరూపించుకోవాలని కోరుతున్నాను” అని రాజీనామా లేఖలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =