కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 468 డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates 468 2BHK Dignity Houses in Cantonment Constituency, Minister KTR Inaugurates 468 2BHK Dignity Houses, 468 2BHK Dignity Houses in Cantonment Constituency, Minister KTR, KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, Telangana, 468 2BHK Dignity Houses, 2BHK Dignity Houses, Cantonment Constituency, Minister KTR Inaugurates 2BHK Dignity Houses, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్ పల్లిలో రూ.36.27 కోట్లతో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లా రెడ్డి, మహమూద్ అలీలు లాంఛనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఇక్కడ ఉచితంగా కట్టించి ఇస్తున్న ఈ ఇళ్లులు ప్రైవేట్ బిల్డర్స్ కడితే 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటుందని, అయితే ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆ ఆస్తిని అందజేస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే, రూపాయి తీసుకోకుండా ఇలాంటి ఇళ్లు ఇచ్చే ప్రభుత్వం తెలంగాణలో తప్ప ఎక్కడా లేదని వేరే రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచుకుని, మోడల్ కాలనీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత లబ్దిదారులపై ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 20 =