అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు.. సింగరేణి ఎన్నికల్లో కుస్తీ..

Alliance In Assembly Elections Wrestling In Singareni Elections, Alliance In Assembly Elections, Assembly Elections Wrestling, Wrestling In Singareni Elections, Singareni Elections Wrestling, Singareni Elections, BRS, Congress, CPI, Assembly Elections, Latest Assembly Elections News, Politcal News, Telangana, Mango News, Mango News Telugu
Singareni Elections, BRS, Congress, CPI

తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఐ ఒక స్థానంలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టింది. త్వరలో తెలంగాణలో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ.. సింగరేణి ఎన్నికలొచ్చే సరికి పొత్తు లేదని చేతులు దులిపేసింది. కాంగ్రెస్ పొత్తు అంటుంటే.. సీపీఐ మాత్రం పొత్తకు నో అంటే నో అని తేల్చి చెబుతోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సింగరేణి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ మొదటివారంలోనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికాగా.. అర్హత కలిగిన సంఘాలు, గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. అయితే అప్పుడు అనూహ్యంగా ఎన్నికలను వాయిదా వేశారు. డిసెంబర్ 27కు ఎన్నికలను పోస్ట్‌పోన్ చేశారు. దీంతో మరో నాలుగు రోజుల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ అనుబంధ సంఘం టిబిజికెఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

నిజానికి సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి సింగరేణిలో బలం కాస్త ఎక్కువ. ఆ తర్వాత బీఆర్ఎస్ అనుబంధ సంఘం టిబిజికెఎస్‌కి మంచి మద్ధతు ఉంది. దీంతో ఎలాగైనా కోల్డ్ బెల్ట్‌లో మరోసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ అనుబంధ సంఘం పావులు కదుపుతోంది. అయితే అధికార కాంగ్రెస్‌ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీకి కాస్త బలం తక్కువగా ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి ఝలక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది.

కానీ ఇక్కడే కాంగ్రెస్‌కు రివర్స్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీతో కలిసి ఎన్నికలకు వెళ్లేదే లేదని ఏఐటీయూసీ తేల్చిచెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఐఎన్‌టీయూసీతో పొత్తు ఉండదని స్ఫష్టం చేసింది. దీంతో రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలే అనే చర్చ సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =