ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వే ఏం తేల్చింది?

Who Is The PM Candidate Kharge Kejriwal Nitish Mamata And Rahul, Who Is The PM Candidate, PM Candidate, PM Face For INDIA Bloc,Who Is The PM, Kharge, Kejriwal, Nitish Kumar, Mamata Benarjee, Rahul Gandhi, Prime Ministerial Candidate, PM, Next PM, Indian Politics, Telangana, Mango News, Mango News Telugu
PM Face for INDIA bloc,Who is the PM , Kharge, Kejriwal, Nitish Kumar, Mamata Benarjee , Rahul Gandhi, prime ministerial candidate,

కొన్నాళ్లుగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈనెల డిసెంబర్ 19న ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి అయిన ఇండియా సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు పీఎం పదవికి ప్రస్తావనకు వచ్చింది. కానీ ఆయన దానిని తిరస్కరించారు. నిజానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గేను.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. కానీ దీని గురించి ఖర్గే పెద్దగా పట్టించుకోలేదు.  ముందుగా ఎన్నికల్లో గెలవాలని, తర్వాత మిగతావి ఆలోచించవచ్చని సున్నితంగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు.

మరోవైపు ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటే బాగుంటుందనే దానిపై సీ-వోటర్ కూడా ఒక సర్వే నిర్వహించింది. అయితే ఇందులో తేలిన గణాంకాలు..రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపించాయి. ఈ సర్వేలో, ఇండియా కూటమికి పీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనే ప్రశ్నపై   27 శాతం మంది అత్యధికంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరును సూచించారు.

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును  14 శాతం మంది సూచించినట్లు సర్వే చెబుతోంది. అలాగే  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 12 శాతం మంది, బీహార్ సీఎం నితీష్ కుమార్ కు 10 శాతం మంది ఈ సర్వేలో మద్దతు నిలిచారు. అటు   పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరును 8 శాతం మంది, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును 5 శాతం మంది  తీసుకున్నారు. అదే సమయంలో 24 శాతం మంది ‘తెలియదు’ అని సమాధానం ఇచ్చారు.

మరోవైపు  ప్రధాని అభ్యర్దిగా మల్లికార్జున్ ఖర్గే పేరును తక్కువ మందే కోరుకున్నప్పటికీ..ఏకంగా 44 శాతం మంది  ఖర్గేను ఇండియా కూటమికి కన్వీనర్‌గానే చూడాలని ఉందంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. అయితే 34 శాతం మంది మాత్రం ఖర్గేను కూటమికి కన్వీనర్ గా వద్దని చెప్పగా.. 22 శాతం మంది మాత్రం తెలియదని సమాధానం చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =