టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు..

An Empty Hyderabad Vehicles at Toll Plazas,An Empty Hyderabad,Vehicles at Toll Plazas,Railway Stations, Sankranti,TS News ,An empty Hyderabad, vehicles at toll plazas,Mango News,Mango News Telugu,Hyderabad Vehicles,Real Time Road Traffic,Latest News On Hyderabad Traffic,Toll Plazas On Hyderabad,Vehicles at Toll Plazas Latest News,Vehicles at Toll Plazas Latest Updates,Hyderabad News,Toll Plazas Live Updates
Railway Stations, Sankranti,TS News ,An empty Hyderabad, vehicles at toll plazas,

సంక్రాంతి కళ పల్లెకు తరలివెళ్తుంది. సంక్రాంతి పండుగను బంధువులు, అయినవాళ్ల మధ్య జరుపుపోవడానికి తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు చేరుకోగా.. మరికొంతమంది ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెలుతున్నారు. దీంతో  బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇటు హైదరాబాద్ రోడ్డన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో నిండిపోగా.. రిజర్వేషన్‌ కంపార్టుమెంట్లలో కూడా ప్రయాణికులు ఎక్కేయడంతో మిగిలిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక జనరల్ కోచ్‌లో ఊపిరి పీల్చుకోలేనంత రద్దీ ఏర్పడింది. మరోవైపు, ఈ సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లాడానికి  1.50 లక్షలమందికి పైగా ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్నారు.

ఇప్పటికే రైల్వే శాఖ  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా..రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులను ఏర్పాటుచేశారు. సంక్రాంతి సెలవులతో పాటు  శని, ఆదివారాలు కలిసి రావడంతో  సెలవులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులు.. తమ కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు శుక్రవారం రాత్రి నుంచే బయలుదేరి వెళ్లారు. దీంతో హైదరాబాద్  టూ విజయవాడ 65వ నేషనల్ హైవేపై  ఏపీకి వెళ్లే వాహనాల రద్దీ పెరిగింది.

హైదరాబాద్ -విజయవాడ 65 వ నేషనల్ హైవేపై చౌటుప్పల్ పంతంగి, కేతేపల్లి కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు తీరడంతో గంటల కొద్దీ వాహనాలు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోతున్నాయి. అంతేకాదు అద్దంకి -నార్కట్ పల్లి జాతీయ రహదారిపై మాడ్గుల పల్లి టోల్ ప్లాజా, బీబీ నగర్ గూడూరు టోల్ ప్లాజాల వద్ద వెహికల్  రద్దీ పెరిగినా టోల్ ప్లాజాల వద్ద  ఫాస్టాగ్ వల్ల వాహనాలు వేగంగా కదులుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nineteen =