యుపిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

Ganga Expressway construction, Ganga Expressway project, Mango News, Narendra Modi, PM Modi Lays Foundation Stone For Ganga Expressway, PM Modi Lays Foundation Stone For Ganga Expressway Worth Rs 32600 Crores In UP, PM Modi Lays Foundation Stone Of 594-km Long Ganga Expressway, PM Modi lays foundation stone of Ganga Expressway, PM Modi lays foundation stone of Ganga Expressway in UP, PM Modi to lay foundation stone of Ganga Expressway, PM Modi to lay foundation stone of Ganga Expressway in UP, PM Modi To Lay Foundation Stone Of Ganga Expressway Today, PM Narendra Modi lays foundation stone of Ganga Expressway project, Prime Minister Of India

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 36,230 కోట్లతో నిర్మిస్తున్న ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందింది. మీరట్‌లోని బిజౌలి గ్రామం దగ్గర ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే.. ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు విస్తరించబడుతుంది. మెరుగైన నెట్‌వర్క్ మరియు ఎక్స్‌ప్రెస్‌వేల ఇంటర్‌కనెక్టివిటీతో, ఉత్తరప్రదేశ్‌.. లక్నో మరియు ఢిల్లీకి అనుసంధానించబడుతుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే విశేషాలు

* ఆరు వరుసలు కలిగిన గంగా ఎక్స్ ప్రెస్ వే అంచనా వ్యయం రూ.36,230 కోట్లు.
* గంగా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి దాదాపు 18,55,000 చెట్లను నాటనున్నారు.
* షాజహాన్‌పూర్‌లో 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ కూడా నిర్మించబడుతుంది.
* గంగా ఎక్స్ ప్రెస్ వేలో 17 చోట్ల ఇంటర్ చేంజ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
* ఎక్స్‌ప్రెస్‌వే హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ మరియు ప్రతాప్‌గఢ్ సహా పన్నెండు జిల్లాల గుండా వెళుతుంది.
* గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో ఏడు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, 14 పెద్ద వంతెనలు, 126 చిన్న వంతెనలు, 375 అండర్‌పాస్‌లు, తొమ్మిది పబ్లిక్ కన్వీనియన్స్ కాంప్లెక్స్‌లు, రెండు టోల్ ప్లాజాలు, 15 ర్యాంప్ టోల్ ప్లాజాలను నిర్మించనున్నారు.
* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్లు మరియు పాల ఆధారిత పరిశ్రమల స్థాపనలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
* గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్పత్తి యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తి కేంద్రాలను దేశ రాజధానితో అనుసంధానించడానికి పారిశ్రామిక కారిడార్‌గా పనిచేస్తుంది.
* గంగా ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా, రోహిల్‌ఖండ్ మరియు వింధ్య ప్రాంతంలోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలలో వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటకం మరియు పరిశ్రమలు ఊపందుకుంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 6 =