లాక్‌డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి -సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Orders Officials To Implement Strict Lockdown, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India COVID 19 Cases, Strict Lockdown, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Lockdown, telangana lockdown extension, telangana lockdown rules, telangana lockdown updates, Telangana Strict Lockdown, Total COVID 19 Cases

కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్  కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు.

కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలిసిన వారిని కూడా గుర్తించి క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువయినప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు.

  • లాక్‌డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈసత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలి.
  • లాక్‌డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగు కాకుండా దూరం పాటించాలని సూచించారు.
  • రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి.
  • ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. అందరికీ డబ్బులు చేరతాయి.
  • గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకుని పోవాలి.
    పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి.
  • ఏప్రిల్ 11, శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

Video thumbnail
Minister Harish Rao Inspects Villages & Knowing Peoples Problem | Telangana Lockdown | Mango News
02:43
Video thumbnail
Minister Harish Rao Conversation With Farmers & Knowing Their Problems | Telangana News | Mango News
04:26
Video thumbnail
Etela Rajender Says Telangana Will Become A 'Corona-Free' State By April 22nd | #Covid19 | MangoNews
07:35
Video thumbnail
CM KCR Shocking Punches On Telangana Drunkards I #CoronaVirus | Telangana Lockdown | Mango News
13:00
Video thumbnail
Minister Etela Rajender Responds Over Telangana Lockdown Extension | Telangana News | Mango News
08:19
Video thumbnail
CM KCR Funny Comments In Press Meet | Covid-19 | Telangana Lockdown | #CoronaOutbreak | Mango News
04:22
Video thumbnail
CM KCR Requests Every Citizen To Follow Lockdown Rules | #Covid19 | Telangana Lockdown | Mango News
12:16
Video thumbnail
War Of Words Between CM KCR And Revanth Reddy | TRS Vs Congress | Telangana News | Mango News
13:25
Video thumbnail
CM KCR Gives Clarity Over Lockdown In Telangana | #CoronaOutbreak #TelanganaLockdown | Mango News
10:10
Video thumbnail
CM KCR Angry Speech Over Spreading Of Fake Social Media Posts | #TelanganaLockdown | Mango News
07:04
Video thumbnail
CM KCR Funny Jokes In Press Meet | #CoronaVirus | #IndiaLockdown | Telangana News | Mango News
12:21
Video thumbnail
CM KCR Thanked Donars For Helping CM Relief Fund | #Covid19 | Telangana Lockdown | Mango News
06:00
Video thumbnail
CM KCR Participates In Diya Jalao Campaign To Fight Corona | #LightForIndia | #Covid19 | Mango News
04:04
Video thumbnail
CM YS Jagan Participates In Diya Jalao Campaign To Fight Corona | #LightForIndia | Mango News
02:06
Video thumbnail
AP CM YS Jagan Sensational Decision On Corona | AP Lockdown | Covid-19 | AP Latest News | Mango News
04:14
Video thumbnail
DGP Gautam Sawang Speaks About Present Situation In Andhra | Covid-19 | AP Lockdown | Mango News
03:16
Video thumbnail
CM YS Jagan Requests PM Modi Over Covid-19 In Video Conference | AP Lockdown | #Corona | Mango News
06:53
Video thumbnail
CM YS Jagan Sensational Statements Over Govt Employees Salaries | AP Lockdown | Covid-19 | MangoNews
06:29
Video thumbnail
AP Minister Kodali Nani Press Meet On Ration Delivery | AP Lockdown | AP Latest News | Mango News
09:11
Video thumbnail
Perni Nani Speaks About Jagan's Key Decision Taken In Cabinet Over Covid-19 | AP News | Mango News
06:08
Video thumbnail
AP CM YS Jagan Requests People Not To Come Out | AP Lockdown | AP Latest Updates | Mango News
09:52

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =