సీఎం మార్పుపై స్పష్టత, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం కేసీఆర్‌ వెల్లడి

CM KCR, CM KCR Rubbishes Rumours over CM Change, KCR rubbishes change in guard claims, KCR Rubbishes Rumours On KTR, KCR Rubbishes Rumours On KTR As CM, KCR Rubbishes Rumours over CM Change, KCR Says He will be the CM For Next 10 Years, KCR Will remain Telangana CM, Mango News, Rumours On KTR As CM, Rumours over CM Change, Telangana CM KCR

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. గతకొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో సీఎం పదవి చేపట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ప్రచారంపై కూడా సీఎం కేసీఆర్ నాయకులకు స్పష్టత ఇచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదని సూచించారు.

ఇక ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు నమోదు చేయాలని, ఈ ప్రక్రియ పదిహేను రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ మేయర్‌ అభ్యర్థిని ఎన్నిక రోజునే ప్రకటిస్తామన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లను సీల్డ్‌ కవర్‌ విధానం ద్వారా ప్రకటిస్తామని, పార్టీ నిర్ణయించిన వారికే కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మద్ధతుగా ఉండాలన్నారు. అలాగే రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ పాటించకుండా అంతర్గత విభేదాలకు కారణమైన, కలిసి సమన్వయంతో పనిచేయకున్నా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి దాక సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని చెప్పారు. అనంతరం ఆరు లక్షల మందితో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని, అప్పటి పరిస్థితులని బట్టి వేదిక నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 10 =