“గ్లామ‌ర్” లేని ఎన్నికలు

Elections Without Glamour,Election Glamour,Without Glamour, Telangana Assembly Elections, Telangana BJP, Kishan Reddy, Etela Rajender, Bandi Sanjay, Vijayashanti,Mango News,Mango News Telugu,Telangana Latest News and Updates,Telangana Politics, Telangana Political News and Updates,Telangana BJP News Today,Bandi Sanjay Latest News,Bandi Sanjay Latest Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
telangana assembly elections, telangana bjp, kishan reddy, etela rajender, bandi sanjay, vijayashanti

భార‌తీయ జ‌న‌తా పార్టీ తాజాగా 40 మందితో స్టార్ క్యాంపెన‌ర్ల జాబితా ప్ర‌క‌టించింది. అందులో కూడా బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి పేరు లేదు. టికెట్ల జాబితాలోనూ ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. మున్ముందు వ‌స్తుంద‌న్న‌దీ సందేహ‌మే.. విజ‌య‌శాంతి అనే కాదు.. ఎందుకో ఈసారి తెలంగాణ  ఎన్నికల్లో సినీతారల గ్లామర్‌ కనిపించడం లేదు.గతంలో మాదిరిగా సినీతారలు.. ముఖ్యంగా హీరోయిన్స్‌ ఇప్పుడు పోటీ చేయడం లేరు. నిరాసక్తతతో వారే  ఎన్నికల రంగంలో దిగడంలేదా లేక ప్రధాన పార్టీలు వారిని పట్టించుకోలేదా? అన్నది అంతుపట్టడం లేదు.

ఎన్నికలైనా సినీతారలు బరిలో దిగితే ఆ ఆసక్తే వేరు. వారి అభిమానులు, రాజకీయనేతలతోపాటు సామాన్య ప్రజలకు సైతం వారు గెలుస్తారా లేదా అనే ఆసక్తి ఉంటుంది.వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రత్యర్థులెవరు? వారిపై వీరు గెలవగలరా అనో లేదా వీరిపై వారు గెలవగలరా ? అనో చర్చలుసాగేవి.  మొత్తానికి సినీతారలు రంగంలో దిగే నియోజకవర్గాల్లో పరిస్థితులు రసవత్తరంగా ఉండేవి. ఈసారి ఆ దృశ్యాలు కనిపించడం లేవు. ఆందోల్‌ నియోజకవర్గం నుంచి బాబూమోహన్‌ తప్ప  ఇతరులెవరూ పోటీ చేస్తున్నట్లు లేదు.

సినీ రంగంలో వెలుగు వెలిగిన తర్వాతే మనరాష్ట్రంలో నందమూరి తారకరామారావు, తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు.తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది,ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పలువురు సినీ హీరోలు, హోరోయిన్లు పోటీచేసి రాణించడం  తెలిసిందే. తెలుగులోనే చూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచే పలువురు ఎన్నికల్లో పోటీచేసి విజయాలు సాధించారు. సూపర్‌స్టార్‌ నటశేఖర   కృష్ణ, కలెక్షన్‌కింగ్‌ మోహన్‌బాబు, నందమూరి  హరికృష్ణ, బాలకృష్ణ, రెబెల్‌స్టార్‌   కృష్ణంరాజు, మురళీమోహన్‌లతో పాటు ఇంకా ఎందరో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడం తెలిసిందే. వారే కాదు నిర్మాతలు,దర్శకులు తదితరులు సైతం అటు రాజకీయాల్లోనూ రాణించారు.

తెలంగాణ రాములమ్మగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సాధించుకున్న విజయశాంతి,  జయప్రదలు ఎంపీలుగా, సహజనటి జయసుధ, రోజా ఎమ్మెల్యేలుగా రాజకీయ రంగంలోనూ విజయాలు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయశాంతి, జయసుధలు పోటీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరూ బీజేపీలోనే ఉన్నారు. విజయశాంతి  మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, జయసుధ సికింద్రాబాద్‌  నుంచి  పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ టిక్కెట్లు మాత్రం  దక్కలేదు. చివరి జాబితాలో ఏమైనా ఇస్తారేమో వేచి చూడాల్సిందే ! పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినా ఈ ఎన్నికలకు అది వర్తించనందున కాబోలు ఏ పార్టీ కూడా మహిళలకు తగినన్ని సీట్లివ్వలేదు. రాజకీయ రంగంలో పాపులారిటీ ఉన్న పలువురు   మహిళానేతలు సైతం  ఈసారి   పోటీలో  కనిపించడం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =