తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల తక్కువుగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 29, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1016 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 7 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా, 409 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, వారిలో 13 మంది చిన్న పిల్లలు ఉండడం విశేషం. ప్రస్తుతం 582 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 11 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారాయి. 11 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టీవ్ కేసు కూడా లేదని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రహిత జిల్లాల జాబితా:
- సిద్ధిపేట
- మహబూబాబాద్
- మంచిర్యాల
- నారాయణ్ పెట్
- వనపర్తి
- పెద్దపల్లి
- వరంగల్ రూరల్
- భద్రాద్రి కొత్తగూడెం
- నాగర్ కర్నూల్
- ములుగు
- యాదాద్రి
Media bulletin
Date: April 29, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/ReCz4nD4qb
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu