డ్రైవర్ మద్యం సేవించాడని తెలిసి కూడా వాహనంలో ప్రయాణించే వారిపై కేసు నమోదు

Control Accidents, Cyberabad Traffic Police, Cyberabad Traffic Police New Rule, Cyberabad Traffic Police to Implement Another Rule, Cyberabad Traffic Police to Implement Another Rule to Control Accidents, Mango News, New Traffic Rule to Control Accidents, Rule to Control Accidents, Traffic law enforcement in Hyderabad, Traffic Police Rules & Fines, Traffic Police to Implement Another Rule to Control Accidents

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మరో రూల్ అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వ్యక్తులపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు, ఇకపై డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి కూడా వాహనంలో ప్రయాణించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ విభాగం ట్వీట్‌ చేసింది.

“మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా? అయితే మోటారు వాహనాల చట్టం 1988, సెక్షన్ 188 కింద అతనితో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది” అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇకపై మద్యం సేవించిన వ్యక్తి నడిపే వాహనంలో ప్రయాణిస్తే వారిపై చట్టప్రకారం కేసు నమోదు కానుంది. మరోవైపు ఇటీవలే ద్విచక్రవాహనదారుల విషయంలో కూడా సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని ప్రకటించారు. మొదటిసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే మూడు నెలలు పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని, అలాగే రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు పంపించబడుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 8 =