హరీశ్ రావు వల్లే ఈసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందా..?

EC gave break to Rythu Bandhu distribution,EC gave break to Rythu Bandhu,Rythu Bandhu distribution,EC gave break,Raithu bandhu, elections comission of india, telangana assembly elections,Mango News,Mango News Telugu,Telangana Assembly elections,Rythu Bandhu distribution Latest News,Rythu Bandhu distribution Latest Updates,Rythu Bandhu distribution Live News, Raithu Bandhu Live News
Raithu bandhu, elections comission of india, telangana assembly elections

తెలంగాణలో పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కీలకమైన సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఉపసంహరించుకుంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. దీంతో రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతులకు నిరాశే ఎదురయింది.

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు బంధు నిధులు పంపిణీ చేసే సమయానికి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో రైతుబంధు నిధులు పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ సర్కార్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. శుక్రవారం అందుకు ఈసీ షరుతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 28వ తేదీలోగా రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని ఆదేశించింది. అలాగే ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ఈసీ షరతులు పెట్టింది.

అయితే బీఆర్ఎస్‌ నేతలు ఈసీ షరతులను పక్కనపెట్టి.. రైతుబంధు అంశాన్ని తమ ప్రచారంలో ప్రస్తావించారు. మంత్రి హరీష్ రావు పాలకుర్తి, నర్సంపేట సభల్లో ప్రసంగిస్తూ.. రైతుబంధు గురించి మాట్లాడారు. మంగళవారం ఉదయం రైతులు చాయ్ తాగే సమయానికి.. టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు రైతుబంధు పడ్డ మెసేజ్‌లు వస్తాయని అన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు నియమాలను ఉల్లంఘించారంటూ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ఈసీ వెల్లడించింది. రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని.. అందుకే అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అటు ఈసీ నిర్ణయంపై ప్రత్యర్థి పార్టీల నేతలు స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యం కేసీఆర్, బీఆర్ఎస్ పాలకులకు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటున్నట్లు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దన్న రేవంత్ రెడ్డి.. పది రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే రైతు భరోసా కింద 15 వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తామని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =