మునుగోడు ఉపఎన్నిక: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిపై 48 గంటలపాటు ఈసీ ఆంక్షలు విధింపు

ECI Issue Order to Minister Jagadish Reddy Not to Participate In Public Meetings Rallies for 48 hours, ECI Issue Order to Minister Jagadish Reddy, Minister Jagadish Reddy Stooped For 48 Hours, Minister Jagadish Reddy, Jagadish Reddy Not to Participate In Public Meetings, Mango News,Mango News Telugu, Munugode By-Election Latest News And Updates, Munugode By-Election, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, TRS Party, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై 48 గంటల పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆంక్షలు విధించింది. 2022, అక్టోబర్ 29వ తేది రాత్రి 7 గంటల నుండి 48 గంటల పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి లేదా దానితో ప్రభావం ఉన్న బహిరంగ సభలు, బహిరంగ ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలు మరియు ఇంటర్వ్యూలు, మీడియాలో బహిరంగ ప్రకటనలు (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) మొదలైన వాటిల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనవద్దని ఆంక్షలు విధిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు ఓటర్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థిని ఎన్నుకోకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ, శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి జగదీష్ రెడ్డికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ జారీ చేసిన నోటీసులకు మంత్రి శనివారం వివరణ ఇవ్వగా, మంత్రి సమాధానాన్ని పరిశీలన చేసిన అనంతరం తాజాగా ఆయనపై 48 గంటల పాటుగా ఆంక్షలు విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =