తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో సరి-బేసి విధానంలో ప్రత్యామ్నాయ రోజులలో దుకాణాలు తెరవడానికి అనుమతించబడతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. బేసి నంబర్ దుకాణాలు బేసి రోజులలో, సరి నెంబర్ దుకాణాలు సరిరోజుల్లో తెరవబడతాయని పేర్కొన్నారు. సోమవారం రోజును 1 గా, మంగళవారం 2 గా పరిగణిస్తున్నామని, అలాగే జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో దుకాణాలకు నెంబర్లు వేస్తున్నారని చెప్పారు. కేటాయించిన రోజున మాత్రమే దుకాణాలు తెరవాలని యజమానులకు స్పష్టం చేశారు. రెండు పక్క ప్రక్కనే ఉన్న దుకాణాలు లేదా దుకాణాల సమూహాల మధ్య ఏదైనా సమస్య లేదా వివాదం ఏర్పడితే లాక్డౌన్ సమయం ముగిసే వరకు ఆ ప్రాంతంలో అన్ని దుకాణాలను మూసివేస్తామని ప్రకటించారు.
మాల్స్, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు, సినిమా హాళ్లకు ఈ నిబంధనలు వర్తించవని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవి మూసివేయబడతాయని తెలిపారు. రెస్టారెంట్ల నుండి టేక్-అవేస్, డెలివరీ అనుమతించబడతాయన్నారు. అలాగే కంటైన్మెంట్ ఏరియాల్లో ఎలాంటి దుకాణాలు తెరవడానికి అనుమతి లేదని చెప్పారు.
దుకాణాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు:
- దుకాణంలో పనిచేసే వారికి మరియు వినియోగదారులకు అందరూ మాస్క్లు ధరించడంతప్పనిసరి.
- నో మాస్క్- నో గూడ్స్ విధానాన్ని అనుసరించాలి.
- మాస్కు ధరించకపోతే రూ.1000 /- జరిమానా.
- 4 అడుగులతో సామాజిక / భౌతిక దూరం పాటించేలా గుర్తులు ఏర్పాటు చేయాలి.
- దుకాణాల వద్ద అన్ని ఎంట్రీ మరియు ఎగ్జిట్స్ పాయింట్స్ లో హ్యాండ్ శానిటైజర్ సదుపాయం కల్పించాలి.
- ఎలివేటర్ బటన్లు, డోర్ హ్యాండిల్స్ వంటి కామన్ టచ్ పాయింట్లను ఎరుపు రంగు ద్వారా సూచించాలి.
- సాధ్యమైన చోట, ఆటోమేటిక్ తలుపుల ఏర్పాటు చేయాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu