ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ

Intense Competition In Congress For Khammam MP Seat, Intense Competition In Congress, Congress For Khammam MP Seat, Khammam MP Seat, Khammam MP Ticket, Congress, Ponguleti Srinivas Reddy, Batti Vikramarka, Latest Khammam MP Seat News, MP Seat News Khammam, Polictical News, Telangana, Mango News, Mango News Telugu
Khammam MP Ticket, congress, Ponguleti srinivas reddy, Batti vikramarka

తెలంగాణలో పదేళ్లుగా అధికారంలోవున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. 17కు 17 లోక్ సభ స్థానాలను దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎత్తుగడలకు పైఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్.. 17 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొందట. ముఖ్యంగా ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు మంత్రులు ఆ టికెట్ కోసం పోటీపడుతున్నారట. తమకంటే తమకే ఇవ్వాలని పట్టు పట్టుకొని కూర్చున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ గుప్పిట్లో ఉండడంతో.. పోటీ చేస్తే కచ్చితంగా గెలవచ్చని నేతలు భావిస్తున్నారట. అందుకే ఆ టికెట్ కోసం అంతలా పోటీపడుతున్నారట.

ఖమ్మం లోక్ సభ టికెట్ తన భార్యకు ఇవ్వాలని పట్టుపడుతున్నారట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే తనకే ఖమ్మం లోక్ సభ టికెట్ కన్ఫామ్ అని భట్టి దేవిక ఫిక్స్ అయిపోయిందట అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోందట. ఇదే సమయంలో అదే సీటుపై కన్నేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ టికెట్ తన కొడుకు కోసం తుమ్మల ప్రయత్నాలు చేస్తున్నారు. తన కొడుకు యుగెంధర్‌ను ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అందుకే హైకమాండ్ వద్ద ఆ టికెట్ తమకే కేటాయించాలని పట్టుపట్టుకొని కూర్చున్నారట.

ఇక ఇదే టికెట్ కోసం అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన సైడ్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ టికెట్ తన తమ్ముడికే ఇవ్వాలని పొంగులేటి కోరుతున్నారట. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు హైకమాండ్‌తో కూడా పొంగులేటి చర్చలు జరిపారట. మరి హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 5 =