తెలంగాణలో అధికారం మాదే: కేటీఆర్

Power in Telangana is ours says ktr,Power in Telangana,Telangana is ours,telangana assembly elections, polling, results, ktr, congress, brs,Mango News,Mango News Telugu,telangana assembly elections, polling, results, ktr, congress, brs,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,Telangana Political News And Updates,Congress Latest News,Congress Latest Updates
telangana assembly elections, polling, results, ktr, congress, brs

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపోరు రసవత్తరంగా సాగింది. రెండు నెలల పాలు తెలంగాణ మారుమ్రోగిపోయింది. కోడికూసింది మొదలు.. అర్థరాత్రి వరకు నేతలు కంటిమీద కునుకులేకుండా ప్రచారాలు నిర్వహించారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు. గద్దెనెక్కేందుకు తీవ్రంగా శ్రమించారు. మంగళవారంతో తెలంగాణలో ప్రచారానికి తెరపడగా.. గురువారం కీలకఘట్టమైన పోలింగ్ కూడా పూర్తయింది. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది.

పోలింగ్ ముగియడంతో.. పలు సంస్థలు సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇచ్చాయి. ఈసారి తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉందని తేలింది. అయితే ఎగ్జిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని అన్నారు.

3న వెలువడబోయే అసలైన ఫలితాలు తమకు గుడ్ న్యూస్ చెబుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు అధైర్య పడొద్దని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేశామన్న కేటీఆర్.. ఈసారి కూడా తప్పు అని ప్రూవ్ చేస్తామన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈసారి 88 సీట్లు వస్తాయని భావించామన్న కేటీఆర్.. పలు కారణాల వల్లే 70 పైగా స్థానాల్లో తప్పకుండా గెలుపొంది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీ విజయం కోసం.. అభ్యర్థుల గెలుపు కోసం మొన్నటి వరకు కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. కంటిమీద కునుకులేకుండా రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశారు. ఏ ఒక్కరినీ.. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా కేటీఆర్ కలుపుకొని పోయారు. అయితే గురువారం పోలింగ్ ముగియడంతో.. చాలా కాలం తర్వాత రాత్రి కంటినిండా నిద్రపోయానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అటు ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండడంతో.. కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, నేతలు మూడో తేదీ వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని.. నేటి నుంచి సంబరాలు మొదలు పెట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి సూచించారు. మరి ఎగ్జిట్ పోల్సే నిజమవుతాయా..? లేక తారుమారవుతాయా..? తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది ఉత్కంఠకరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =