స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దు.. ఆకునూరి మురళి సంచలన పోస్ట్

Dont send smita sabharwal to central services sensational post by akunuri murali,Dont send smita sabharwal to central services,sensational post by akunuri murali,central services sensational post,IAS Officer Smitha sabharwal, Akunuri Murali,Retd IAS Officer Akunuri Murali, Akun sabharwal, central services,Mango News,Mango News Telugu,smita sabharwal Latest News,smita sabharwal Latest Updates,smita sabharwal Live News,Akunuri Murali Latest News,Akunuri Murali Live Updates
IAS Officer Smitha sabharwal, Akunuri Murali, Akun sabharwal, central services

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకభూమిక పోషించారు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్.. కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. అయితే  కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లంతా ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించే స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి కలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు.

ఇదే సమయంలో స్మితా సబర్వాల్ డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. స్మితా సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. ఈక్రమంలో స్మితా కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ స్పందించారు. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఆకునూరి మురళీ కోరారు.

గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి.. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి పారిపోవడం, ఇక్కడి తప్పుల్ని తప్పించుకోవటం ఫ్యాషన్‌గా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవటమని నిలదీశారు. దేశంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారిణి ఈమెగారే అంటూ ఆకునూరి మురళీ వ్యాఖ్యానించారు. ఇటువంటి అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆకునూరి మురళీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఈ పోస్టుపై స్మిత సబర్వాల్ స్పందిస్తారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే 2001లో ట్రైనీ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ విధుల్లో చేరారు. మొదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తన పనితీరుతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎంవోలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =