గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్, వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

Minister KTR Shares Video of A Model KG to PG Campus at Gambhiraopet, Sircilla District, Mango News, Mango News Telugu, Minister KTR Shares Video, Gambhiraopet A Model Campus, A Model KG to PG Campus, Telangana builds first KG to PG campus, A Model KG to PG Campus at Gambhiraopet, Gambiraopet KG to PG Educational Institution, Minister KTR Latest News

నాణ్యమైన విద్యను రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధునాతన సదుపాయాలతో పలు చోట్ల విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఒకే ప్రాంగణంలో కేజీ టు పీజీ ఉచిత విద్య కూడా సాకారం కాబోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో సకల సౌకర్యాలతో ఏర్పాటైన ‘కేజీ టూ పీజీ’ భవన సముదాయం/క్యాంపస్ వివరాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

గంభీరావుపేట కేజీ టూ పీజీ క్యాంపస్ కు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేస్తూ, “తెలంగాణలో మారుతున్న విద్యారంగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది గంభీరావుపేటలోని మోడల్ కేజీ టూ పీజీ క్యాంపస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి సౌకర్యాలను కల్పించడమే లక్ష్యం/కల” అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మ‌న ఊరు–మ‌న బడి ప‌థ‌కంలో భాగంగా గంభీరావు పేట‌లో కేజీ (కిండర్ గార్డెన్) టూ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) క్యాంప‌స్‌ ను అన్ని ర‌కాల సదుపాయాలతో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ ను అంగ‌న్‌వాడీ కేంద్రం, ప్రీ ప్రైమ‌రీ స్కూల్, ప్రైమ‌రీ స్కూల్, హైస్కూల్, జూనియ‌ర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సహా ఆరు ఎక‌రాల్లో ఒక లక్ష చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో నిర్మించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో విద్యా బోధన జరుగుతుండగా, 3,500 మంది విద్యార్థులు చ‌దువుకునే అవకాశం ఉంది. 90 క్లాస్ రూమ్స్ తో పాటుగా కంప్యూటర్ అండ్ సైన్స్ ల్యాబ్స్, 1000 మంది విద్యార్థులు కూర్చునేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అలాగే 44 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఫిపా స్టాండర్డ్ ఆస్ట్రో ట‌ర్ఫ్ తో కూడిన మోడర్న్ మల్టీ స్పోర్ట్ సదుపాయాన్ని నిర్మించారు. ఇందులో ఫుట్ బాల్, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్సాల్, క‌బ‌డ్డీ ఆడేలా స్టేడియంల‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కోసం లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =