తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy Released Both 1st and 2nd Year TS Intermediate Results 2023,Minister Sabitha Indra Reddy Released Intermediate Results,TS Intermediate Results 2023,Both 1st and 2nd Year TS Intermediate Results Released,Mango News,Mango News Telugu,TS Inter Results 2023 Live,TS Inter Results 2023 Manabadi,TS Inter 1st Year Results 2023,TS Inter 2nd Year Results 2023,Minister Sabitha Indra Reddy Latest News And Updates,TS Intermediate Results 2023,TS Intermediate Results Latest News And Updates

తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట‌ర్ అనేది కీల‌క‌మైన దశ అని, జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 9,45,153 మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజ‌ర‌య్యారని, 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. వివిధ శాఖలకు చెందిన సుమారు 26 వేల మంది సేవ‌లందించారని తెలిపారు.

ఇక ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని, పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇక ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జూన్ 4 నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆమె తెలియజేశారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని వెల్లడించారు. అలాగే పరీక్షల్లో వచ్చిన మార్కులపై ఏవైనా సందేహాలుంటే.. విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అప్లై చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించామ‌ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

కాగా మంత్రి ప్రకటించిన వివరాల మేరకు.. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించి ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది పరీక్షలకు హాజ‌రవగా 62.85 శాతంతో 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రవగా, 67.27 శాతంతో 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో యావరేజీ ఉత్తీర్ణ‌త 61.68 శాతంగా న‌మోదైంది. అయితే ఈ ఫలితాల్లో బాలిక‌లదే పైచేయి అయింది. వారు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించగా.. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. కాగా ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, లేదా.. http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =