హై ఓల్టేజ్ పాలిటిక్స్.. రంగంలోకి అగ్ర‌నేత‌లు

High voltage politics Top leaders in the field,High voltage politics,Top leaders in the field,Today in Politics,Mango News,Mango News Telugu,Political Leadership and the Urban Poor,The politics of poverty,KCR, Assembly Elections, bjp, BRS, Congress, PM Modi, rahul gandhi, Revanth Reddy, Telangana Politics,High voltage politics Latest News,High voltage politics Latest Updates,KCR Latest News,Assembly Elections Latest News,Assembly Elections Latest Updates,Telangana Politics Latest News,Telangana Politics Latest Updates
Telangana politics, assembly elections, brs, bjp, congress, kcr, pm modi, rahul gandhi, revanth reddy

తెలంగాణ‌లో అధికార పార్టీ మిన‌హా.. కాంగ్రెస్‌, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కాంగ్రెస్ నుంచి క‌నీసం తొలి జాబితా అయినా వ‌చ్చింది కానీ.. బీజేపీ నుంచి ఆ ఊసే లేదు. రేపు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్ర‌ధాన పార్టీల అగ్ర‌నేత‌లు మాత్రం తెలంగాణ‌ను చుట్టుముట్టేస్తున్నారు. బీజేపీ నుంచి అయితే.. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రే మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు సార్లు స‌భ‌ల్లో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ మ‌రో స‌భ‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఒకేరోజు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ లు ఎన్నిక‌ల స‌భ‌ల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తించ‌నున్నాయి. కాంగ్రెస్ నుంచి రాహుల్‌, ప్రియాంక గాంధీ ఈరోజు స‌భ‌ల్లో పాల్గొన‌గా.. బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌గా వ‌న్ అండ్ ఓన్లీ కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్  వచ్చే ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆ పార్టీ జాతీయ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. మూడు రోజులపాటు 8 నియోజకవర్గాలలో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ముందుగా వరంగల్ జిల్లాలో రామప్ప ఆలయానికి రాహుల్‌, ప్రియాంక చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం.. సాయంత్రం ములుగులో నిర్వహించే సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. రాహుల్‌ మాత్రం రెండు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నారు.

ఇక.. రేపు కరీంనగర్‌, ఎల్లుండి నిజామాబాద్‌లో రాహుల్‌ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ భావించింది. ఈ యాత్రలో భాగంగా నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు, చెరుకు మహిళా రైతులతో రాహుల్‌ భేటీ అవుతారు. తెలంగాణలో మొదట విడత బస్సు యాత్ర ద్వారా చాలా జిల్లాల్లో రాహుల్‌ పర్యటించనున్నారు. మొదట విడత బస్సు యాత్రలో కొన్ని చోట్ల రాహుల్‌ పాదయాత్ర కూడా చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రైతులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌, ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో.. టీకాంగ్‌ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌రో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు మహబూబ్‌నగర్, మేడ్చల్‌ జిల్లాల్లో జరిగే బహిరంగ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల లో గంగాపూర్‌ రోడ్డు శివాలయం సమీపంలో నిర్వహించే సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభా ఏర్పాట్లను మంగళవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో భారీస్థాయిలో సభకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంలో  సీఎం కేసీఆర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. సభ ఏర్పాట్లను మల్లారెడ్డితోపాటు  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ శంభీపూర్‌ రాజు పరిశీలించారు.

ఒక‌వైపు కాంగ్రెస్‌.. మ‌రోవైపు బీఆర్ ఎస్‌.. భారీ స‌భ‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  ఎవ‌రి నుంచి ఎటువంటి స్టేట్ మెంట్లు వ‌స్తాయో.. ఇంకా ఎవ‌రు ఏమి వ‌రాలు కురిపిస్తారో అన్న ఆస‌క్తి అంత‌టా ఏర్ప‌డుతోంది. ఇరు పార్టీల నేత‌ల‌నూ స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి భారీ గా ప్లాన్ చేశారు. జ‌న స‌మీక‌ర‌ణ‌పై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 6 =