తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: శాసనసభలో నేటినుంచి మూడు రోజులపాటు బడ్జెట్‌ పద్దులపై చర్చ, ప్రశ్నోత్తరాలు

Telangana Assembly Budget Sessions Day 4 Debate Begins For Three Days From Today on Budget Issues,Telangana Budget On 6Th February,Telangana Budget Important Discussion,House On Budget And Payments On 8Th,Mango News,Mango News Telugu,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాలుగోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేటినించి మూడు రోజులపాటు శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ ప్రారంభమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులపై సభలో జరుగనున్న చర్చలో సభ్యులు పాల్గొననున్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ చర్చలో నేడు మొదటిరోజున సంక్షేమం, పౌరసరఫరాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, రహదారులు-భవనాలు, పర్యాటక, క్రీడాశాఖలకు సంబంధించి మొత్తం 12 పద్దులపై చర్చించనున్నారు. దీనిలో భాగంగా నేడు సభ ప్రారంభమవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాలు, కల్యాణలక్ష్మి పథకం, మైనార్టీలకు రుణాలు, ఎకో టూరిజం, ఎస్‌ఆర్‌డీపీ, గొర్రెల పెంపకం, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, సబర్బన్‌ బస్సుల అంశాలపై విస్తృతమైన చర్చ జరుగనుంది. మరోవైపు శాసనమండలిలో నేడు బడ్జెట్‌పై చర్చ కొనసాగనున్న సందర్భంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. చివరిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్నారు. ఇక బుధవారం శాసనసభలో మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌పై సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 17 =