కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ, పలు అంశాలపై చర్చ

CM KCR Meets Union Jal Shakti Minister Gajendra Singh, CM KCR meets with Jal Shakti Minister Gajendra Singh, KCR Meets Union Jal Shakti Minister, KCR urges Jal Shakti Min to defer gazette notification, Mango News, New Delhi, Telangana CM K Chandrasekhar Rao, Telangana CM KCR Meets Union Jal Shakti Minister Gajendra Singh Shekavat, Telangana CM KCR Meets Union Jal Shakti Minister Gajendra Singh Shekavat at New Delhi, Telangana CM KCR Urges Union Jal Shakti Minister, Telangana CM Meets Gadkari, Union Jal Shakti Minister Gajendra Singh Shekavat

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి న్యూఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప‌లు నీటి ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ నోటిఫికేషన్, నీటి కేటాయింపులపై సీఎం కేసీఆర్ కేంద్రమంత్రితో కీలకంగా చర్చించారు. ముఖ్యంగా కేంద్రం ఇటీవల జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులను అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని, వాటిని వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ కోరారు.

గోదావరి జలాలకు సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీలు ఈ పరిధిలోకే వస్తాయని, ఇందులో ఇప్పటికే 758.76 టీఎంసీల ప్రాజెక్టులకు గతంలోనే సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసిందని సీఎం వివరించారు. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానదీ జలాల పంపిణీ కోసం కృష్ణాట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చేసిన సూచన మేరకు కృష్ణా ట్రైబ్యునల్‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటున్నామని, ఈ నేపథ్యంలో కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎం కేసీఆర్ కోరినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =