ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, పండుగ సెలవులు, పరీక్షల వివరాలివే…

Mango News, Telangana Inter Academic Calendar Released, Telangana Intermediate 2021-22 Academic Calendar, Telangana school calendar for 2021-22 released, Telangana State Intermediate 2021-22 Academic Calendar Released, TS Inter Academic Calendar 2021 for Intermediate Education, TS Inter academic calendar 2021-22, TS School Academic Calendar 2021-2022, TSBIE releases tentative academic calendar, TSBIE releases tentative academic calendar for 2021-22

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యను అందించే ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలు (జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులు) ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలని రాష్ట్ర ఇంటర్‌ బోర్డు పేర్కొంది. 2021-22 విద్యాసంవత్సరంలో ఇప్పటికే జరిగిన 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి మొత్తం 220 పనిదినాలు ఉంటాయని తెలిపారు. అలాగే ఈసారి పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ, అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ 2021-22 అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు:

  • పని దినాలు: 220 (ఆన్‌లైన్‌ తరగతులు-47, ప్రత్యక్ష తరగతులు-173)
  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2021
  • దసరా సెలవులు: అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 16 వరకు
  • దసరా తర్వాత కాలేజీల ప్రారంభం: అక్టోబర్‌ 18
  • అర్ధ సంవత్సర పరీక్షలు: డిసెంబర్‌ 13 నుంచి 18వ తేదీ వరకు
  • సంక్రాంతి సెలవులు: 2022 జనవరి 13, 14,15 (మూడు రోజులు)
  • సంక్రాంతి తర్వాత కాలేజీల ప్రారంభం: జనవరి 17
  • ప్రీఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 10, 2022 నుంచి ఫిబ్రవరి 18, 2022 వరకు
  • ప్రాక్టికల్‌ పరీక్షలు: ఫిబ్రవరి 23, 2022 నుంచి మార్చి 15, 2022 వరకు
  • ఇంటర్ పరీక్షలు: మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్‌ 12, 2022 తేదీ వరకు
  • చివరి పనిదినం: ఏప్రిల్ 13, 2022
  • వేసవి సెలవులు: ఏప్రిల్‌ 14, 2022 నుంచి మే 31, 2022 వరకు
  • అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: మే, 2022 చివరి వారంలో
  • కాలేజీలు తిరిగి ప్రారంభించే తేదీ (2022-2023 విద్యా సంవత్సరం): జూన్ 1, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 6 =