తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు, నేటినుంచే చట్టం అమలు

Telangana Govt Releases Gazette on Govt Employees Retirement Age Extension

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపుకు సంబంధిన చట్టం రాష్ట్రంలో నేటి నుంచే (మార్చి 30, 2021) అమల్లోకి వస్తున్నట్టుగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితిని ప్రస్తుత 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతునట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల వయోపరిమితి పెంపుకు సంబంధించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లోయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరన్యునేషన్) (సవరణ) చట్టం-2021 కు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్ ఆమోదం పొందాక ఆ చట్టంపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తాజాగా నేటి నుంచే ఈ చట్టం అమలు కానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 61 సంవత్సరాలపాటుగా సర్వీసులో కొనసాగున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పీఆర్సీ కమిషన్ కూడా ఈ విషయాన్ని నివేదించిందని, పలు ఉద్యోగ సంఘాలతో కూడా సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =