ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే

AP Second Phase Panchayat Elections: Polling for 2786 Panchayats Tomorrow,Mango News,Mango News Telugu,Andhra Pradesh Panchayat Election 2021: Voting and result for second phase polls tomorrow,Panchayat Elections 2021: Stage Set For 2nd Phase Polls In 2786 Panchayats Tomorrow,Second phase of Andhra Pradesh panchayat polls today,2nd phase of Andhra Pradesh panchayat polls on Feb 13,Andhra Pradesh panchayat elections phase,Andhra Pradesh all set for second phase,Andhra Pradesh Panchayat Election 2021 LIVE: Phase-2 polling underway counting of votes to begin at 4PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లోని 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు రేపు (ఫిబ్రవరి 13, శనివారం) పోలింగ్ జరగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కోసం 29,304 పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా 18 డివిజన్లకు చెందిన 167 మండలాల్లోని 3328 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల అవగా 539 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 2,786 పంచాయతీల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు.

కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల సిబ్బందికి గ్లోజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47492 మంది పాల్గొంటున్నారు. ఎస్ఈసీ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను పర్యవేక్షించనున్నారు. ఇక ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాలలోని గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభిస్తారు. ఫలితాల వెలువడ్డ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =