తెలంగాణలో గ్రానైట్ కంపెనీలలో దాడులపై ఈడీ ప్రకటన, పలు కీలక విషయాలు వెల్లడి

Telangana ED Announces Cash Seizures Benami Accounts Illegal Granite Exports Identified After Karimnagar Raids, Telangana ED Announces Cash Seizures, Telangana ED Announces Seizures Of Benami Accounts, Illegal Granite Exports Identified After Karimnagar Raids, Telangana ED Karimnagar Raids, Karimnagar Raids, Illegal Granite Exports, Telangana Enforcement Directorate, ED raids granite firms in Karimnagar, Telangana ED, Enforcement Directorate, Illegal Granite Exports News, Illegal Granite Exports Latest News And Updates, Illegal Granite Exports Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణలో గడచిన మూడు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లోని పలు పరిశ్రమలపై ఈడీ ఏకకాలంలో ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు గ్రానైట్ కంపెనీల అధిపతుల నివాసాలు మరియు కార్యాలయాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సోదాలలో అనేక బినామీ బ్యాంకు ఖాతాలను గుర్తించామని, లెక్కల్లో చూపని నగదు పెద్ద మొత్తంలో దొరికిందని వెల్లడించారు. నవంబర్ 9, 10 తేదీల్లో శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్‌ఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, వాటికి సంబంధించిన కార్యాలయాలు, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించామని తెలిపారు.

ఆయా కంపెనీలకు చెందిన గత పది సంవత్సరాల లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, ఇవి ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సులు, రాయితీలు ఎగవేతకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ సంస్థలు చైనా, హాంకాంగ్, చైనా మరియు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాకులను ఎగుమతి చేస్తున్నాయని, అయితే లెక్కల్లో మాత్రం వీటిపై పూర్తి సమాచారం లేదని కేంద్ర ఏజెన్సీతెలిపింది. అలాగే విచారణ సమయంలో, రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎగుమతి చేయబడిన పరిమాణం ఎక్కువగా ఉందని, ఎగుమతి చేసేటప్పుడు పరిమాణం గురించి నివేదించడం లేదని కనుగొనన్నామని చెప్పారు. ఇక ఇదే విషయంపై తన అధికారిక ట్విట్టర్ లో.. ‘ఫెమా ఉల్లంఘనలను పరిశోధించడానికి మరియు వెలికితీసేందుకు కరీంనగర్ మరియు హైదరాబాద్‌లోని శ్వేత గ్రానైట్స్ ఇంకా ఇతరుల కార్యాలయాలు మరియు నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహించాం. శోధన సమయంలో లెక్కలో చూపని రూ. 1.08 కోట్ల నగదు మరియు వివిధ నేరారోపణ పత్రాలు కనుగొనబడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది’. అని పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + nineteen =