గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ పరీక్షలకు రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లో ఉచిత శిక్షణ

Telangana Free Off-line Coaching Program for Group-2 3 4 DSC at all BC Study Circles in the State, Free Off-line Coaching Program for Group-2 DSC at all BC Study Circles in the State, Free Off-line Coaching Program for Group-3 DSC at all BC Study Circles in the State, Free Off-line Coaching Program for Group-4 DSC at all BC Study Circles in the State, Free Off-line Coaching Program for Group-2, Free Off-line Coaching Program for Group-3, Free Off-line Coaching Program for Group-4, all BC Study Circles in the State, Telangana Free Off-line Coaching Program for Group-2 3 4, TSPSC coaching for group 1 2 and 3 job exams, TSPSC coaching, Group-2, Group-3, Group-4, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ నోటిఫికేషన్స్ వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-2, 3, 4, డీఎస్సీ మరియు గురుకులం ఉపాధ్యాయులకు ఆఫ్ లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ కొరకు రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లలో మరియు హైదరాబాద్ లోని టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ లో నిర్ణిత సమయంలో ఉచిత శిక్షణ ప్రారంభించబడుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అనగా గ్రూప్-2,3,4 ఉచిత శిక్ష‌ణ కోసం అభ్య‌ర్థులు ఎస్ఎస్సీ, ఇంట‌ర్‌, డిగ్రీలో ఫ‌స్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలని, అలాగే డీఎస్సీ, గురుకులం ఉపాధ్యాయులకు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు బీఈడీలో ఫ‌స్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాల‌ని పేర్కొన్నారు. కాగా దరఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌ త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5ల‌క్ష‌ల లోపు ఉండాల‌ని సూచించారు.

అభ్యర్థులు వారి యొక్క కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటుగా విద్యార్హత ధ్రువీకరణ జిరాక్స్ లతో నేరుగా ఓయూ సెంటర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఆవరణలోని టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. సంబంధిత వివ‌రాల‌కు 040-24071178, 040-27077929లో సంప్ర‌దించాల‌ని తెలంగాణ బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ ప్రకటనలో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =