తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లాక్డౌన్ పొడిగింపు, లాక్డౌన్ అమలులో సడలింపులపై జీవో నెం.64 తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జోన్స్ తో సంబంధం లేకుండా నిషేదించబడినవి:
- ప్రయాణీకుల దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణం.
- లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వ్యక్తులకు ప్రత్యేక రైళ్లు తప్ప, ప్రయాణీకుల రైలు కార్యకలాపాలు నిషేధం.
- రాష్ట్రాల మధ్య బస్సుల ప్రజా రవాణా.
- జిల్లాల మధ్య మరియు జిల్లాలో బస్సుల ప్రయాణం.
- మెట్రో రైలు సేవలు.
- అన్ని పాఠశాలలు,కళాశాలలు, విద్యా / కోచింగ్ / శిక్షణ సంస్థలు మొదలైనవి.
- హోటళ్ళు, లాడ్జీలు మొదలైన ఆతిథ్య సేవలు.
- బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, క్రీడా సముదాయాలు, వినోదం మరియు జంతుప్రదర్శనశాలలు.
- పార్కులు, మ్యూజియంలు, ఆడిటోరియంలు మొదలైనవి.
- సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా మరియు సాంస్కృతిక ప్రయోజనాల కోసం జరిగే అన్ని సమావేశాలు.
- అన్ని మత ప్రదేశాలు మరియు ప్రార్థనా స్థలాలు.
- అన్ని సామూహిక మత ప్రార్ధనలు.
లాక్డౌన్ సడలింపులు:
–>రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ. అత్యవసర వైద్య సంరక్షణను పొందడం కోసం ఆస్పత్రులు మరియు ఫార్మసీ మినహా ఈ సమయంలో షాపులు / సంస్థలు తీయకూడదు.
–>ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ కవర్ / మాస్క్ ధరించడం తప్పనిసరి. ఉల్లంఘనకు రూ.1000/ – జరిమానా ఉంటుంది.
–>ఆహార పదార్థాలు, ఉత్పత్తితో సహా అవసరమైన వస్తువుల అమ్మకం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల రవాణా మరియు అమ్మకలకు అనుమతి.
–>వ్యవసాయ కార్యకలాపాలు, రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో వస్తువుల రవాణా, ఆసుపత్రులు, క్లినిక్‌లు మరియు వైద్య దుకాణాల పనితీరు, రోగనిర్ధారణ కేంద్రాలుకు అనుమతి.
–>ఉపాధి హామీ పనులు, బ్యాంకులతో సహా ఇతర ఆర్థిక సంస్థలు, ఎన్‌బిఎఫ్‌సిలు, ఫైనాన్స్ కార్యకలాపాలకు అనుమతి.
–>ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు టెలికాం, పోస్టల్ సర్వీసులకు అనుమతి.
–>ఇంటర్నెట్ సేవలు, ఐటీ మరియు ఐటీ సంబంధిత సేవలకు అనుమతి.
–>పెట్రోల్ పంపులు, ఎల్పిజి నిల్వ, రవాణా సంబంధిత కార్యకలాపాలను మొత్తం రాష్ట్రంలో అనుమతించారు.
–> ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లోని గ్రామీణ ప్రాంతాలలో అన్ని నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి. —
> రెడ్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీలో సైట్ వద్ద ఉండే కార్మికులతో నిర్మాణపనులు కొనసాగించుకోవచ్చు.
–> ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లోని గ్రామీణ ప్రాంతాలలో అన్ని పారిశ్రామిక కార్యకలాపాలుకు అనుమతి. ఉదా: స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత పనులు, మరమ్మత్తు వర్క్‌షాప్‌లు, బీడీ తయారీ, ఇసుక మరియు ఇతర మైనింగ్, సిరామిక్ టైల్స్ మరియు రూఫ్ టైల్స్, సిమెంట్ కర్మాగారాలు, జిన్నింగ్ మిల్లులు, ఇనుము, ఉక్కు పరిశ్రమ, ప్లాస్టిక్ మరియు శానిటరీ పైపులు, కాగిత పరిశ్రమ, కాటన్ పరుపులు, ప్లాస్టిక్, రబ్బరు పరిశ్రమ, నిర్మాణ పనులు, ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలు.
–>రెడ్ జోన్స్ లోని పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక ఎస్టేట్లు మరియు పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, ఔషదాలతో సహా అవసరమైన వస్తువుల తయారీ యూనిట్లు, వైద్య పరికరాలు వాటి ముడి పదార్థం, ఐటి హార్డ్‌వేర్ తయారీ, ప్యాకేజింగ్ మెటీరియల్ లాంటి పారిశ్రామిక యూనిట్లుకు మాత్రమే అనుమతి. అదికూడా షిఫ్ట్స్ వారీగా, భౌతిక దూరం పాటించాలి.
–>ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లోని గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్ మినహా అన్ని దుకాణాలు
తెరిచి ఉండటానికి అనుమతి ఉంది.
–> అన్ని మునిసిపల్ ప్రాంతాలలో (జిహెచ్ఎంసి మరియు ఇతర రెడ్ జోన్ మినహా), అన్నీ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ మినహా మిగతా షాపులు ఓపెన్ చేయొచ్చు. అయితే అన్ని షాపులు ప్రత్యామ్నాయ విధానం ప్రకారం తెరవాలి, ఒకే రోజున రెండు ప్రక్కనే ఉన్న దుకాణాలు తెరవబడవు. మునిసిపల్ కమిషనర్ రూపొందించిన జాబితా ప్రకారం ఆదేశాలు పాటించాలి.
–>రెడ్ జోన్‌లోని జిహెచ్ఎంసి మరియు ఇతర మునిసిపల్ సంస్థలలో, నిత్యావసర దుకాణాలతో పాటుగా నిర్మాణ సామగ్రి, హార్డ్‌వేర్, పరికరాలు / యంత్రాలు, పంప్-సెట్లు వంటి వ్యవసాయ కార్యకలాపాల షాపులు.
–> ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లలో అన్ని రకాలకు ఇ-కామర్స్ కు అనుమతి, రెడ్ జోన్స్ లో అవసరమైన వస్తువులకు మాత్రమే అనుమతి.
–>ఐటీ మరియు ఐటీ సంబంధిత సహా ప్రైవేట్ కార్యాలయాలు 33% శాతం ఉద్యోగులతో నడపవచ్చు. జిహెచ్ఎంసి ప్రాంతంతో సహా రెడ్ జోన్స్ లో కూడా అనుమతి. ఇక ఆరెంజ్, గ్రీన్ జోన్స్ లలో పూర్తి స్థాయి ఉద్యోగులతో కార్యాలయాలు నడపవచ్చు.
–> రెడ్ జోన్స్ లో డిప్యూటీ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులుతో 100 శాతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. మిగిలిన సిబ్బంది అవసరానికి అనుగుణంగా 33% వరకు హాజరవుతారు.
–> రెడ్ జోన్స్ లో రెస్టారెంట్లు, బార్బర్ షాపులు, స్పాస్ & సెలూన్లు ఓపెన్ చేయడానికి అనుమతించబడవు. టాక్సీలు, క్యాబ్ అగ్రిగేటర్లు మరియు ఆటో-రిక్షాలు కూడా అనుమతించబడవు.
–>ఆరెంజ్ జోన్లలో ఇద్దరు ప్రయాణికులతో ట్యాక్సీలను నడిపేందుకు అనుమతి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu