తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం

Telangana: Half Day Schools Implementation for Academic Year 2022-23 Starts From March 15th,Half Day Schools Implementation,Academic Year 2022-23,Half Day Schools Starts From March 15th,Telangana Half Day Schools,Mango News,Mango News Telugu,TS Half day School Timings 2023,Telangana Half Day Schools 2023 Date,Telangana Schools to Operate Half-Day,TS Half day School Timings,TS Half Day School Time Table 2023,Telangana Latest News,Telangana Live News,Telangana Schools Latest News,Telangana Schools Updates

తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానుండగా, 2022-23 విద్యా సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 24 వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో నడిచే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుపనున్నట్లు తెలిపారు.

అయితే మధ్యాహ్నం 12:30 గంటలకు తరగతులు పూర్తయిన అనంతరం ఇంటికి వెళ్లే ముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక పదోతరగతి వార్షిక పరీక్షలకు-2023 సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. అలాగే పదోతరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న స్కూల్స్ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ యొక్క రీజినల్ జాయింట్ డైరెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్కూల్స్ లో ఒంటిపూట బడుల నిర్వహణను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here