కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం: కరోనా, ఉపాధి హామీ, వ్యవసాయమే ఎజెండా …

#KCR, CM KCR Meeting with Districts Collectors, CM KCR Meeting with Districts Collectors in Pragathi Bhavan, KCR Meeting With All Districts Collectors, KCR Meeting with Districts Collectors, Pragathi Bhavan, telangana, Telangana CM KCR, Telangana Coronavirus, Telangana Districts Collectors, Telangana Political Updates

జూన్ 16, మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ, ఉపాధి హామీ పథకం అమలు, ఇతరశాఖల పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

అలాగే రైతు వేదికల నిర్మాణం, పల్లెల్లో కల్లాల నిర్మాణం, నియంత్రిత పంట సాగు విధానం, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, వానాకాలం సాగు ఏర్పాట్లలో భాగంగా రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడం వంటి పలు అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండడంతో చేపట్టాల్సిన నివారణ చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =