తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పటినుంచంటే?

Telangana SSC-2023 Annual Exams Time Table Released Exams will be Held From April 3 to 13,Telangana SSC-2023, SSC Annual Exams Time Table Released, Exams will be Held From April 3 to 13,Mango News,Mango News Telugu,Telangana Ssc Time Table,Telangana Ssc Results With Marks 2022,Telangana Ssc Results With Marks,Telangana Ssc Results 2022,Telangana Ssc Results 2021,Telangana Ssc Results 2020,Telangana Ssc Results,Telangana Ssc Memo Download,Telangana Ssc Hall Tickets 2022,Telangana Ssc Hall Ticket,Telangana Ssc Exam Time Table 2022,Telangana Ssc Board Name,Telangana Ssc Board,Telangana Ssc 2022,Telangana Board Ssc Result 2022,Manabadi Telangana Ssc Results 2022,10Th Result 2022 Telangana Ssc

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి-2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే పదో తరగతి పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 3 గంటల పరీక్షా సమయంతో నిర్వహించనున్నారు. కాగా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలాజికల్ సైన్స్ పేపర్ కు 3.20 నిమిషాల సమయం కేటాయించినట్టు పేర్కొన్నారు.

మరోవైపు పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల విధానంలో ప్రభుత్వం 2022-23 నుంచి సంస్కరణలను అమలు చేయనుంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. కాగా సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌ మరియు బయాలజీ సబ్జెక్ట్స్ కు చేరి సగం మార్కులు ఉంటాయని పేర్కొన్నారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 3, 2023 – ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్1 (కాంపోజిట్‌ కోర్స్‌), ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్‌ కోర్స్‌)
  • ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 6 – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
  • ఏప్రిల్ 8 – మ్యాథ్స్ పేపర్
  • ఏప్రిల్ 10 – సైన్స్ పేపర్ (ఫిజికల్ సైన్స్ అండ్ బయాలాజికల్ సైన్స్)
  • ఏప్రిల్ 11 – సోషల్ స్టడీస్
  • ఏప్రిల్ 12 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్) మరియు ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
  • ఏప్రిల్ 13 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =