ఖ‌మ్మం, వరంగల్ మున్సిప‌ల్ కార్పొరేషన్లలో ఎగిరినా గులాబీ జెండా, అన్నిచోట్ల టీఆర్ఎస్ హవా

TRS Party won Kothur, Atchampeta, Jadcherla, Nakrekal Munisipalities,Mango News,Mango News Telugu,GHMC Polls,GHMC polls,Telangana Mini Municipal Elections,TS Mini Municipal Election Results,Telangana Municipal Elections,Telangana Mini Municipal Election Results,Municipal Elections,Municipal Election Results,Warangal Municipal Elections,Mini Municipal Election Results,Telangana Municipal Elections 2021,Telangana Municipal 2021,Telangana Municipal Election,Municipal Elections In Telangana,Khammam Municipal Elections,Telangana Elections,Telangana News,2021 Telangana Mini Municipal Elections,TRS Wins Jadcherla Municipality,Telangana Municipal Election Results,Jadcherla Municipal Elections,Jadcherla Muncipal Elections,Municipal Elections,Municipal Election Results,Mini Municipal Election Results,Municipal Elections In Telangana,TRS Party Won,Atchampeta Muncipal Elections

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ ముగిసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు అచ్చంపేట‌, కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌, న‌కిరేక‌ల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సంచలన ఫలితాలు నమోదు చేసింది. అన్ని చోట్ల గులాబీ జెండా ఎగిరింది.

  • ఖమ్మం కార్పొరేషన్ లో 60 వార్డులుకుగానూ టీఆర్ఎస్ కూటమి 45 వార్డులు (టీఆర్‌ఎస్‌ 43 + సీపీఐ 2) గెలుచుకుని విజయదుందుభి మోగించింది. ఇక కాంగ్రెస్ కూటమి 12 (కాంగ్రెస్ 10 + సీపీఎం 2), బీజేపీ 1, ఇతరులు 2 వార్డులు గెలుచుకున్నారు.
  • వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ లో 66 వార్డులుకుగానూ టీఆర్ఎస్ పార్టీ 48 వార్డులు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 4, బీజేపీ 10, ఇతరులు 4 వార్డులు గెలుచుకున్నారు.
  • నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో మున్సిపాలిటీలో 20 వార్డులకు గానూ టీఆర్ఎస్ పార్టీ 13 వార్డులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 6, బీజేపీ 1 వార్డు దక్కించుకున్నాయి.
  • రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకున్నాయి.
  • నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గానూ టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, ఇతరులు 7 వార్డులు గెలుచుకున్నారు.
  • మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డులకు గానూ టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 వార్డులు దక్కించుకున్నాయి.
  • సిద్ధిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు గానూ టీఆర్ఎస్ 36 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ 1, ఇతరులు 6 వార్డు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది.

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లోని లింగోజిగూడ వార్డుకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ద‌ర్ప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పోరేటర్ గా భారతీయ జనతా పార్టీ తరపున గెలుపొందిన‌ ఆకుల రమేశ్‌ గౌడ్‌ మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఈ వార్డు గెలవడంతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 3 కు పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − five =