ఎస్సై, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో టీఎస్‌ఎల్‌పీఆర్బీ కీలక నిర్ణయం, ఆ అభ్యర్థులకు మరోక అవకాశం

TSLPRB will be Remeasured the Candidates who Disqualified in Height by 1 Cm or below during the PMT-PET,SI Constable Recruitment in Telangana,PMT-PET Events Completed, Final Written Exams Start from March 12th,Mango News,Mango News Telugu,TSLPRB PMT Events,TSLPRB PET Events,Telangana Physical Tests,Physical Tests For SI,Physical Tests For Constable Posts,Telangana SI Posts,Telangana Constable Posts,Telangana SI,Telangana Constable,Telangana Superendent Inspector,Telangana Constable Posts Latest News and Updates,Telangana News and Live Updates

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) బుధవారం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల్లో భాగంగా కీలకమైన రెండోదశలో అభ్యర్థులకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)) పరీక్షల సందర్భంగా 1 సెంటిమీట‌ర్ లేదా అంత కంటే త‌క్కువ ఎత్తు తేడాతో అనర్హులు అయిన అభ్యర్థులు మ‌రోసారి ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్ర‌క‌టించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

“2022లో కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో, రిట్ అప్పీల్ నం.152 ఆఫ్ 2023 మరియు 171 ఆఫ్ 2023 పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, 2022, డిసెంబర్ 8 మరియు 2023 జనవరి 5 మధ్య సమయంలో నిర్వహించిన పీఎంటీ/పీఈటీలలో 1 సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తులో అనర్హులు అయిన అభ్యర్థులు మరియు అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తిరిగి ఎత్తు లెక్కించబడతారు. ఇది టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రత్యేక పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని 2 వేదికలలో అనగా అంబర్‌పేట్ పోలీసు గ్రౌండ్స్‌, కొండాపూర్ 8వ బెటాలియ‌న్‌లో నిర్వహించబడుతుంది” అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలని సూచించారు, ఇందుకోసం అర్హతగల అభ్యర్థుల సంబంధిత లాగిన్ ప్లేస్ టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో (www.tslprb.in) లో ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు వ‌రకు ద‌ర‌ఖాస్తుకు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తునట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థులు ఎత్తు రీమెజర్‌మెంట్‌కు హాజరవుతున్నప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన వారి అప్లికేషన్-కమ్-అడ్మిట్ కార్డ్‌ను ఎత్తు రీమెజర్‌మెంట్ కోసం డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి మాన్యువల్ సమాచారాలు అందించబడవని టీఎస్‌ఎల్‌పీఆర్బీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =