తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే మకాం అక్కడేనా ?

Telangana Congres camp politics,Congres camp politics,Telangana Congres camp,Telangana Exit Polls 2023, Telangana Polls 2023,Telangana Elections 2023,Congress party,votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, YCP,Telangana Congres camp politics,Mango News,Mango News Telugu,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Telangana Exit Polls 2023, Telangana Polls 2023,Telangana Elections 2023,Congress party,votes,Telangana Assembly Elections 2023, assembly seat, BJP,BRS, YCP,Telangana Congres camp politics

తెలంగాణ శాసనసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. నోటిఫికేషన్ వెలువడిన నుంచి  పోలింగ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేశాయి. ఎత్తులు పైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాల, గెలుపును డిసైడ్ చేసే హామీలతో తమ పార్టీని గెలిపించుకోవడమే..  ప్రచారాలతో హోరెత్తించి, ఫర్ఫెక్ట్ పోల్ మేనేజ్ మెంట్ చేసి తమ పార్టీ గెలుపునకు బాటలు వేసుకున్నామన్న ధీమాతో వున్నారు.

ఈ సమయంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ సారి కాంగ్రెస్‌దే అధికారం అని చెబుతున్నాయి.  అయితే భారీ మెజారిటీ వుండకపోవచ్చని కొన్ని సర్వేలు చెబుతుండగా.. మరి కొన్ని సర్వేలు హంగ్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీ .. గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే  క్యాంప్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఈ సారి  కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు గెలుచుకునే  అవకాశాలున్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీంతో 60 నుంచి 70 సీట్లతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించవచ్చని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఓపీనియన్ పోల్స్ మాత్రం తెలంగాణలో ఈసారి  హంగ్ రానుందని చెప్పుకొచ్చాయి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని.. బీజేపీ, ఎంఐఎం కింగ్ మేకర్లుగా మారతాయని విశ్లేషకులు  చెబుతున్నారు.  దీంతో డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఇక్కడా వెలువడితే మాత్రం వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలందరిని క్యాంప్‌కు తరలించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందట. గెలిచిన ఎమ్మెల్యేల కోసం ఇప్పటికే  బెంగళూరులో రిసార్టులు, హోటళ్లను కూడా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. గత అనుభవాలను  దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. హంగ్ వచ్చినా, మెజారిటీ సీట్లు రాకపోయినా తెలంగాణలో మరోసారి ఇదే సీన్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తోంది. దీంతో  ఎన్నికల పలితాలను బట్టి క్యాంప్ రాజకీయాలను ప్లాన్ చేయడానికి సిద్ధం అయిపోయింది.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. తెలంగాణ ఎమ్మెల్యేలను అక్కడికి పంపించే ఆలోచనలో కాంగ్రెస్ అదిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ క్యాంపును నడిపే బాధ్యతను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు  అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీకే తెలంగాణ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాబట్టి పలితాలు వచ్చిన వెంటనే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే  వ్యవహరాలన్నీ ఆయనే స్వయంగా చూసుకుంటారని తెలుస్తోంది.

ఎన్నికల పలితాలను బట్టి  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలో వద్దో కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. హంగ్ దిశగానే విడుదల అయిన పలితాలు ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలను.. వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించడానికి సర్వం సిద్ధం చేశారట. దీని కోసం ఏకంగా ఓ స్పెషల్  విమానాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా బెంగళూరుకు వెళ్లడానికి సిద్దంగా వుండాలని ఇప్పటికే కాంగ్రెస్ అదిష్టానం.. తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులకు సమాచారం ఇచ్చేసారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fourteen =