విలీన గ్రామాల ప్రజల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai Assures Will Take To The Centre Demand of Five Gram Panchayats Which Merged in AP,Telangana Governor Tamilisai,Tamilisai Assures Will Take To The Centre Demand,Five Gram Panchayats Which Merged in AP,Tamilisai Assures Demand of Five Gram Panchayats,Mango News,Mango News Telugu,Telangana Governor Tamilisai Latest News,Telangana Governor Tamilisai Latest Updates,Telangana Governor Tamilisai Live News,Five Gram Panchayats News Today,Governor Tamilisai News Today

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు సామాజిక కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమావేశానికి కూడా ఆమె హాజరయ్యారు. అలాగే ఖమ్మంలో ఏర్పాటు చేసిన వై20 వర్క్‌షాప్‌లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో గిరిజనులతో ముఖాముఖీ నిర్వహించారు. విలీన గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తమిళిసైకి పలు సమస్యలను విన్నవించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీలో విలీనమైన ఐదు తెలంగాణ గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే అంశాన్ని పరిష్కరించాలని గిరిజనులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆమె, విలీన గ్రామాల ప్రజల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసీలు సమస్యను పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ తమిళిసై తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 1 =