ఏపీలో ఇళ్ల పట్టాలు పంపిణీ మరోసారి వాయిదా

Amaravati House plots Distribution, Andhra Pradesh, Andhra Pradesh News, AP Govt House Plots Distribution, AP Govt House Plots Distribution Program, AP House Plots Distribution Program Postponed, House Plots Distribution In AP, House Plots Distribution Program Postponed

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేసింది. మరోవైపు అక్టోబర్‌ 2న ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 కి వాయిదా వేశారు. తాజాగా కోర్టు విచారణ నేపథ్యంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =