వైఎస్సార్‌సీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Janasena Chief Pawan Kalyan Sensational Comments on YSRCP Leaders, Pawan Kalyan Comments on YSRCP Leaders, Jana Sena chief Pawan Kalyan, YSRCP Leaders, Mango News, Mango News Telugu, Janasena Mangalagiri Party Office, Pawan Kalyan Leaves Vizag, Pawan Kalyan At Gannavaram Airport, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasena Party, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీ నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులను ఉద్దేశించి వెధవల్లారా, సన్నాసుల్లారా అంటూ సంభోదించారు. ఈ రోజు నుంచే యుద్ధం మొదలు పెడుతున్నామని, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తామని, రాళ్లు, రాడ్లు దేనితోనైనా యుద్దానికి సిద్ధం అని సవాల్ చేశారు. తనకు రాజకీయం తెలియదనుకుంటున్నారా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని అనడం లేదని, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి గౌరవప్రదమైన వ్యక్తులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి మర్యాద ఇస్తానని, కానీ బూతులు తిట్టే నేతలకే వార్నింగ్ ఇస్తున్నానని హెచ్చరించారు.

అలాగే వైసీపీలో ఉన్న కాపు నాయకులను కూడా ఆయన హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని, తనను ప్యాకేజీ స్టార్ అన్న ఎదవలు దానిని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ లోని గుండాలకు చెప్తున్నానని, ఇప్పటివరకు తనలో సహనం, మంచితనం మాత్రమే చూశారని, ఇకపై వాటిని పక్కకు పెట్టి ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చి మరీ కొడతానని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ తీరుపై కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని, అందుకే తన వ్యూహం మార్చుకున్నానని తెలిపారు. ఇక ప్రధాని మోదీపై తనకు గౌరవం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్.. అలాగని ఒకరికి ఊడిగం చేయనని తేల్చి చెప్పారు. కాగా అక్టోబర్ 15వ తేదీన విశాఖపట్నంలో అధికార వైఎస్సార్సీపీ మరియు జనసేన పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =