ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపం, గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

AP CM YS Jagan's Special Flight Takes Emergency Landing in Gannavaram Due To Some Technical Snag,AP CM YS Jagan's Special Flight,Special Flight Takes Emergency Landing,Emergency Landing in Gannavaram,Gannavaram Due To Some Technical Snag,Mango News,Mango News Telugu,Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,A.P. Political Parties List,A.P. Political Parties List,Andhra Pradesh Politics News,Ap Government And Politics,Ap News,Ap Political Map,Ap Politics And Government,Ap Politics Latest News,Ap Politics Latest Updates,Ap Politics Results,Ap Politics Today,Ap Politics Twitter,Latest Survey On Ap Politics,New Political Party In Andhra Pradesh,Political News Today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఈ క్రమంలో విమానం టేకాఫ్ అయిన కొద్దీ నిమిషాల వ్యవధిలోనే ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఏవియషన్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈరోజు సీఎం జగన్ ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. దీనిలో భాగంగా ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో ఆయన సమావేశమవ్వాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో సీఎం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ఇక రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 15 =