ఏపీ ఈఏపీ సెట్‌ (EAPCET) షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

AP Education Minister Adimulapu Suresh Released EAPCET Schedule Today, AP Education Minister Announces EAPCET 2022 Schedule, AP Education Minister Adimulapu Suresh Released EAPCET 2022 Schedule, EAPCET 2022 Schedule, 2022 EAPCET Schedule, AP Education Minister Adimulapu Suresh, AP Education Minister, Adimulapu Suresh, Minister Adimulapu Suresh, EAPCET Schedule, EAPCET Schedule Released, EAPCET Schedule Latest News, EAPCET Schedule Latest Updates, EAPCET, AP Engineering Agriculture Pharma Common Entrance Test 2022, AP Engineering Common Entrance Test 2022, AP Agriculture Common Entrance Test 2022, AP Pharma Common Entrance Test 2022, AP EAPCET exams would be held for five days from the 4th of July to the 8th of July, AP EAPCET exams, AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్‌కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET అనే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఏపీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ ఎంసెట్‌-2022 పరీక్ష, బీ ఫార్మసీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్‌లు జరుగుతాయని, అలాగే 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి ఎగ్జామ్ జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 136 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

అయితే ఈ ఎగ్జామ్స్ కోసం తెలంగాణలో కూడా నాలుగు సెంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 11 న నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామని తెలియజేశారు. ఎగ్జామినేషన్ ప్యాట్రన్, ర్యాంకింగ్ ప్యాట్రన్స్‌ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని విద్యార్థులకు తెలిపారు. కాగా ఈ పరీక్షల ఫలితాలు ఆగస్టు 15వ తేదీ నాటికి వెలువడేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామని, ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =