వైఎస్సార్‌సీపీ నేతలపై పవన్ కళ్యాణ్‌ వ్యాఖలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని

AP Ex Minister Perni Nani Strong Counter to Janasena Chief Pawan Kalyan Comments on YSRCP Leaders, Perni Nani Criticises Pawan Kalyan, Perni Nani Says Dilogues Work In Movies Not Politics, AP Former Minister Perni Nani, Janasena Chief Pawan Kalyan, Mango News, Mango News Telugu, Janasena Party, Andhra Pradesh Latest Political News, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో కాక పుట్టిస్తున్నారు. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వైఎస్సార్‌సీపీ నేతలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా కలకలం సృష్టించాయి. పరుష పదజాలంతో సూటిగా చేసిన ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ సినిమా డైలాగులు చెప్తారని, అంతకుమించి ఇంకేం చేయలేరని ఎద్దేవా చేశారు. ఆయనకు ధైర్యముంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్ధులతో పోటీ చేయించాలని సవాల్ విసిరారు.

పవన్ అలా చేస్తే ఆయనను తాము ప్యాకేజ్ స్టార్ అని పిలవమని పేర్ని నాని తెలిపారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సఖ్యత లేనట్లు నటించారని, ఈరోజుతో వారి ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. జనసేన తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లేనని, వారిద్దరూ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ నిజరూపం ఈరోజు ప్రజలకు అర్థమైందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన దిగజారుతున్నారని మండిపడ్డారు. పబ్లిక్ మీటింగ్స్ లో అసభ్య పదజాలంతో మాట్లాడి రాజకీయాల్లో రాణించలేమని, వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్ని నాని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =